MP Vijayasai Reddy: రాహుల్ వినమ్రత గొప్పది.. వైసీపీ ఎంపీ విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా వైసీపీ ఎంపీ రాహుల్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వినమ్రత ఎంతో గొప్పదంటూ ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రాహుల్‌పై అలాగే పాదయాత్రపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేత తీరును ఎండగడుతూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇటీవల రాహుల్ తన తల్లి సోనియా షూలేస్ కడుతుండడం, ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయి. తాజాగా వైసీపీ ఎంపీ రాహుల్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వినమ్రత ఎంతో ‘గొప్పది’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఏఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో నేను నిర్ణయించను,’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో వినమత్రతో చెప్పడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.
‘ భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని మండలం గ్రామాల్లో బుధవారం నడుస్తుండగా, ‘కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరతారా?’ అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు రాహుల్ జీ ఇచ్చిన జవాబు ఇది. అంతేకాదు, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం. మల్లికార్జున ఖర్గే తన అధికార పరిధిలో అన్ని నిర్ణయాలూ తీసుకుంటారని కూడా నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడు చెప్పడం కూడా చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. భారత జాతీయ కాంగ్రెస్ లో ఎట్టకేలకు ప్రజాస్వామీకరణకు రాహుల్ గాంధీ జీ అవకాశం ఇస్తున్నందుకు ప్రజలు ‘సంతోషిస్తున్నారు.’ అని కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై సెటైర్లు వేశారు విజయసాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..