AP: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్.. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామన్న డీఎస్పీ

YCP leader Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. నిన్న డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన లాయర్లను పంపారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు మళ్లీ నోటీసులివ్వడంతో ఇవాళ జోగి రమేష్ హాజరయ్యారు. తాను నిరసన తెలిపేందుకు వెళ్లానే తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని మరోసారి రమేష్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.

AP: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్.. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామన్న డీఎస్పీ
Ycp Leader Jogi Ramesh
Follow us
Venkata Chari

|

Updated on: Aug 21, 2024 | 9:51 PM

TDP chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. నిన్న డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన లాయర్లను పంపారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు మళ్లీ నోటీసులివ్వడంతో ఇవాళ జోగి రమేష్ హాజరయ్యారు. తాను నిరసన తెలిపేందుకు వెళ్లానే తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని మరోసారి రమేష్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే, విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు డీఎస్పీ మురళీకృష్ణ. అవసరమైతే మరోసారి జోగి రమేష్‌ను విచారణకు పిలుస్తామన్నారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు జోగి రమేష్‌. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. లేటెస్ట్‌గా వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులిచ్చారు. దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరిగింది? అక్కడ ఉన్న నేతలెవరు? అన్నది తెలుసుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మూడేళ్ల క్రితం ఫుటేజ్‌ తమ దగ్గర ఉండదని రిప్లయ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఆరుగురు వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లందరికీ హైకోర్ట్‌ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు మరిన్ని పక్కా ఆధారాల కోసం వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. వీడియో ఫుటేజ్ దొరికితే టీడీపీ ఆఫీస్‌పై దాడి కోసం వైసీపీ కార్యాలయం నుంచి నేతలు బయలుదేరి వెళ్లారా లేదా అన్నది తేలనుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..