కోపంగా కనిపించే ఆ ఖాకీ వెనుక అంతులేని కరుణ.. అనాధ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్సై..
పోలీసులంటే లాఠీ చేతపట్టుకొని గంభీరంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది పోలీసులు ఎంతో మృదుస్వభావంతో , మానవతాహృదయంతో ఉంటారు...

పోలీసులంటే లాఠీ చేతపట్టుకొని గంభీరంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ కొంతమంది పోలీసులు ఎంతో మృదుస్వభావంతో , మానవతాహృదయంతో ఉంటారు. కోపంగా కనిపించే ఆ ఖాకీ వెనుక సంద్రమంత కరుణ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో పోలీసులు ప్రజలకు సహాయపడటం చూస్తాం. కొన్నిసార్లు సాహసాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ మహిళా ఎస్సై చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్ధానికులు బయటికి తెచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు కోరినా వారు స్పందించలేదు. దీంతో స్ధానిక మహిళా ఎస్సై ఒకరు ఈ విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఓ గుడ్డలో అతన్ని పడుకోబెట్టి కిలోమీటర్ మేర భుజాలపై మోసుకువచ్చింది.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శిరీష..పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం కనిపించింది. అయితే, ఆ మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లి స్థానిక చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పజెప్పింది. పొలాల గట్లను కూడా లేక్కచేయకుండా ఎంతో కష్టపడి దాదాపు కిలో మీటర్ దూరానికి పైగా అనాథ శవాన్ని మోశారు ఎస్ఐ శిరీష. శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
రికార్డు క్రియేట్ చేసిన స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎక్కడా విడుదల చేశాడో తెలిస్తే షాకే..
