Andhra Pradesh: అదేమన్న చికెన్ ముక్క అనుకుంటివా..! అత్త చెవిని అమాంతం కొరికేసిన కోడలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..

అత్తా కోడళ్ల పోరు అంటే.. మామూలుగా ఉండదు మరి.. ఇలాంటి కుటుంబ కలహాలు, వివాదాలు అన్నిచోట్ల కనిపించే వ్యవహారమే.. అయితే.. ఓ కోడలు మరో అడుగు ముందుకు వేసింది.. అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది..

Andhra Pradesh: అదేమన్న చికెన్ ముక్క అనుకుంటివా..! అత్త చెవిని అమాంతం కొరికేసిన కోడలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 08, 2024 | 10:26 AM

అత్తా కోడళ్ల పోరు అంటే.. మామూలుగా ఉండదు మరి.. ఇలాంటి కుటుంబ కలహాలు, వివాదాలు అన్నిచోట్ల కనిపించే వ్యవహారమే.. అయితే.. ఓ కోడలు మరో అడుగు ముందుకు వేసింది.. అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు అత్త చెవిని దారుణంగా కొరికేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు.. కొన్ని రోజులుగా కోడలు పావనికి అత్త నాగమణి (55) కి కుటుంబ కలహాల కారణంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పావని, నాగమణికి ఆదివారం రాత్రి గొడవ జరిగింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.. దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికింది.. దీంతో నాగమణి చెవి భాగం మొత్తం ఊడిపోయింది.

అనంతరం అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. స్థానికులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే.. ఆలస్యం కావడంతో తెగిన చెవి అతుక్కోవడం కష్టమని వైద్యులు చెప్పారు. దీంతో చేసేదేం లేక అక్కడే చికిత్సను కొనసాగిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..