Andhra Pradesh: హైదరాబాద్‌లో ఉన్నారా.. ఏపీలో ఉన్నారా..! పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? సర్వత్రా ఉత్కంఠ..

|

May 24, 2024 | 9:35 AM

ముందస్తు బెయిల్ వచ్చింది.. అరెస్టు నుంచి స్వల్ప ఊరట దొరికింది. మాచర్లలో YCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక అజ్ఞాతం వీడతారా.. ఇప్పుడిదే ఉత్కంఠ..! 13న పోలింగ్‌ రోజు హింస చెలరేగింది. తర్వాత కూడా అల్లర్లు కొనసాగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. ఇప్పుడు ముందస్తు బెయిల్ రావడంతో అజ్ఞాతం వీడే అవకాశం ఉంది అంటున్నారు.

Andhra Pradesh: హైదరాబాద్‌లో ఉన్నారా.. ఏపీలో ఉన్నారా..! పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? సర్వత్రా ఉత్కంఠ..
Pinnelli Ramakrishna Reddy
Follow us on

ముందస్తు బెయిల్ వచ్చింది.. అరెస్టు నుంచి స్వల్ప ఊరట దొరికింది. మాచర్లలో YCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక అజ్ఞాతం వీడతారా.. ఇప్పుడిదే ఉత్కంఠ..! 13న పోలింగ్‌ రోజు హింస చెలరేగింది. తర్వాత కూడా అల్లర్లు కొనసాగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. ఇప్పుడు ముందస్తు బెయిల్ రావడంతో అజ్ఞాతం వీడే అవకాశం ఉంది అంటున్నారు. నియోజకవర్గానికి వస్తారంటూ అభిమానుల ఊహాగానాలు ఉన్నా.. ఆంక్షల నేపథ్యంలో పిన్నెల్లి ఏం చేస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే.. పిన్నెల్లి విషయంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని కోర్టుకు పిన్నెల్లి లాయర్‌ తెలిపారు. అంతేకాదు టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని పిన్నేల్లిని అరెస్ట్ చేస్తున్నారంటూ వాదించారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ సరికాదన్నారు. ట్విట్టర్‌ వీడియో ఆధారంగా ఎలా అరెస్ట్‌ చేస్తారు? అంటూ ప్రశ్నించారు. అది మార్ఫింగ్‌ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంది కదా అని క్వశ్చన్‌ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని.. పోలింగ్‌ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిన్నెల్లి తరపు లాయర్‌. ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారంటూ గుర్తు చేశారు. వాదనలు విన్న తర్వాత పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇలాగే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినవారికి ఊరట ఇస్తూ తీర్పు ఇచ్చింది.

లైవ్ వీడియో చూడండి..

అయితే.. మాచర్లలో ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఇవాళ బయటకు వస్తారా.. మీడియాతో మాట్లాడతారా..? ఇంతకీ.. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నారా.. ఏపీలో ఉన్నారా..! అనేది చర్చనీయాంశంగా మారింది. జూన్‌ 5 వరకూ బెయిల్‌ ఇచ్చినా హైకోర్టు.. షరతులు పెట్టిన నేపథ్యంలో పిన్నెల్లి నిర్ణయం ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..