Nellore: మరో మహిళతో ఉండగా ఎస్సైను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆ తర్వాత దంచుడే
నెల్లూరులో ఏఆర్ SI వాసుకి భార్య దేహశుద్ధి చేసింది. మరో మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. కొన్నేళ్లుగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు వాసు.

ఇటీవల కాలంలో విలాసాలకు అలవాటు పడ్డ కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి తప్పుటడుగులు వేసి అడ్డంగా బుక్కయ్యాడు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్.ఐ. వాసు.. భార్య చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. తనను కాదని, మరో మహిళతో కలిసి ఉన్న భర్తను చితకబాదేసింది. గత కొన్నేళ్లుగా భార్య సామ్రాజ్యంతోపాటు పిల్లలకు దూరంగా ఉంటున్నాడు ఎఆర్ ఎస్ఐ వాసు.
గుంటూరుకు చెందిన వాసు దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు.. ఇద్దరు పిల్లలున్నారు. 2017 నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 2018 నుంచి తన భర్త మౌనిక అనే మహిళతో సహాజీవనం చేస్తున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాసు భార్య సామ్రాజ్యం మండిపడుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరులో కాపురం పెట్టాడని తెలుసుకుని కుటుంబసభ్యులతో కలిసి వచ్చి.. దాడి చేసింది సామ్రాజ్యం. మహిళతో వాసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదారు. తన భర్త తనకు కావాలని సామ్రాజ్యం డిమాండ్ చేస్తోంది.
అయితే వాసు వెర్షన్ మరోలా ఉంది. కరోనా సమయంలో తనను చూసే దిక్కులేకపోయేసరికి.. ఆమెతో ఉంటున్నట్లు తెలిపాడు. తన భార్యతో విడాకులు అప్లై చేసి.. 6 ఏళ్లు అవుతుందని.. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే.. పోలీసులకు చెప్పాలి కానీ ఇలా ఇంటికి వచ్చి తనపై దాడి చేయడం సమంజసం కాదన్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




