Weather: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 28వ తేదీ రాత్రి నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే

మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం & పొరుగు ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవరణం బుధవారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 4.5 కి.మీ మధ్య విస్తరించి ఉన్నది.

Weather: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 28వ తేదీ రాత్రి నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే
AP Weather Alert
Follow us

|

Updated on: Oct 26, 2022 | 3:05 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇప్పుడు ఇలా ఉందంటే.. మున్ముందు ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అక్టోబర్ 28వ తేదీ రాత్రి నుంచి ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్, అమరావతి కేంద్రాలు తెలిపాయి. శ్రీలంక మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ఈ అల్పపీడనం.. వాయుగుండం, ఆపై తీవ్ర వాయిగుండంగా మారే సూచనలు ఉన్నాయి. దీంతో అక్టోబర్ 29 నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురవనున్నాయి.  ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పములో  అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ కల్లోలం

సిత్రాంగ్‌ తుఫాన్‌ సృష్టించిన కల్లోలానికి బంగ్లాదేశ్‌ వణికిపోయింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఈ తుఫాన్‌ ధాటికి 35 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఎక్కువ మంది విపరీతమైన గాలులకు చెట్లుకూలడం వల్ల చనిపోయారు.  టికోనా దీవి వద్ద ఈ తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్‌లోని 15 జిల్లాల్లో సిత్రాంగ్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. 10 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా చోట్ల రేకులతో ఉన్న ఇళ్ల పైకప్పులన్నీ గాలులకు కొట్టుకుపోయాయి. వెయ్యికి పైగా రొయ్యల ఫామ్స్‌ కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంలో పూడిక తీసే డ్రెడ్జర్‌ మునిగిపోయిన ఘటనలో 8 మంది చనిపోయారు.

మరో వైపు ఈదురుగాలకు కరెంట్‌ స్తంభాలు పడిపోవడంతో బంగ్లాదేశ్‌లో చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనేక మంది చిమ్మ చీకట్లలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తుఫాను కేంద్రానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఢాకాలోనూ దాని ప్రకంపనలు కనిపించాయి. ఢాకాలో సోమవారం ఒక్క రోజే 32 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌ను ఏటా తుఫాన్లు ముంచుతెత్తుతున్నాయి. ఈ శతాబ్దం 22 సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌లో వచ్చిన 11వ తుఫాన్ ఇది. 2015 నుంచి ప్రతీ సంవత్సరం ఏదో ఒక సమయంలో తుఫాన్‌ బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తూనే ఉంది.

బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేసిన సిత్రాంగ్‌ తుఫాన్‌ ప్రభావం ఇండియాలోనూ కనిపించింది. బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఉండే అస్సాం, త్రిపుర, మేఘాలయా, అరుణాచల్‌ ప్రదేశ్‌ మిజోరం రాష్ట్రాలు తుఫాన్‌కు తల్లడిల్లాయి. అస్సాంలో 83 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. 325 హెక్టార్లలో పంట నష్టం సంభవించాయి. ఈశాన్య భారతదేశంలో విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. కొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..