AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి పండక్కి ఊరెళ్లిన ఉద్యోగి.. ఆ మర్నాడు ఫోన్‌ చేసి షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన పనిమనిషి..

చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. ఫ్యాక్టరీకి చెందిన జేపీ శీతారామయ్య ప్లాట్లో(204) జరిగిన చోరీలో పెద్ద మొత్తంలో నగదు, సుమారు కేజీ బంగారం, వెండి వస్తువులు, వజ్రాభరణాలు దొంగతనం అయ్యాయి.

దీపావళి పండక్కి ఊరెళ్లిన ఉద్యోగి.. ఆ మర్నాడు ఫోన్‌ చేసి షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన పనిమనిషి..
Chettanadu Cement Factory
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 26, 2022 | 4:41 PM

అత్యంత భ్రదత ఉండే ప్రాంతం అది…అలాంటి ఏరియాలోనే దొంగలు తెగబడ్డారు. సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో నలభై లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డైమండ్స్, నగదు ఎత్తుకుపోయారు. దీపావళి రోజున ఎవరూ లేరన్న విషయాన్ని గమనించి పక్కాగా స్కెచ్ వేశారు. ఇంటిలో ఉన్నదంతా ఊడ్చుకొని పోయారు. కార్మిక సంఘ నేత ఇల్లే లక్ష్యంగా జరిగిన చోరి వెనుక ఉన్నదెవరూ… తెలిసిన వాళ్లు చేశారా.. లేక ప్రొఫెషనల్ నేరగాళ్లు రంగంలోకి దిగారా… ఎవరూ అంత పక్కాగా ప్లాన్ అమలు చేసింది… వారిని పట్టుకునేందుకు నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగటం మరింత సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. 204 క్వార్టర్స్‌లో ఉద్యోగుల సంఘం జాయింట్ ప్రెసిడెంట్ శీతారామయ్య ఉంటారు. బయట నుండి ఎవరైనా వ్యక్తులు ఫ్యాక్టరీలోకి వెళ్లాలంటే భధ్రత సిబ్బందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదిన శీతారామయ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని కొడుకు ఇంటికి వెళ్లాడు. 24 వ తేదిన ఇంటి ముందు ఊడ్చేందుకు పని మనిషి వచ్చింది. అయితే అప్పటికే ఇంటి తాళాలు పగుల గొట్టి ఉండటం, వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చి సెక్యూరిటీకి చెప్పింది. దీంతో ఈ విషయాన్ని శీతారమయ్యకు చెప్పారు. ఆయన హూటాహుటిన ప్లాట్ కు వచ్చి పరిశీలించగా ఇంటిలో ఉండాల్సిన రెండు కేజీల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, డైమండ్స్ తో పాటు నాలుగ లక్షల రూపాయల నగదు కనపడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు దొంగలు ఇంటిని దోచుకున్నట్లు గ్రహించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల నిఫుణులను పిలిపించారు. అయితే చోరి జరిగి మూడు రోజులు కావస్తున్న చిన్న క్లూ కూడా పోలీసులకు లభ్యం కాలేదు. దీంతో నిన్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వాళ్లే దొంగతనానికి పాల్పడ్డారా లేక ప్రొఫెషనల్స్ రంగంలోకి దిగారా అన్న కోణంలో విచారణ జరిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఫ్యాక్టరీలోకి దొంగలు ఏవిధంగా వచ్చి ఉంటారా..? అన్న కోణంలో ఎస్పీ అనువణువు పరిశీలించారు. అయితే స్థానికుల సాయం లేకుండా దొంగతనం జరిగే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి