ఏటీఎంలో రూ. 200 నకిలీ నోట్లు గుర్తింపు.. ‘ఫుల్ ఆఫ్ ఫన్’ అంటే ఏంటో మీకు తెలుసా..?
సంఘటనకు సంబంధించిన ఈ వార్త మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్థానికులు ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లగా.. మెషీన్‌లోంచి నకిలీ నోట్లు బయటకు వచ్చాయి. ఇది చూసి షాక్ అవుతారు.
కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకులో భద్రంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పండగలు, అవసరాల నిమిత్తం డబ్బు డ్రా చేసుకోవటం కోసం ప్రజలు ఏటీఎంల ముందు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా దీపావళి పండగ వేళ ఇక్కడ కొందరు ప్రజలకు ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే.. నకిలీ నోట్లు బయటకొచ్చాయి. దాంతో కంగుతిన్న కస్టమర్లు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంబంధి అధికారులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వార్త మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్థానికులు ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లగా.. మెషీన్‌లోంచి నకిలీ నోట్లు బయటకు వచ్చాయి. ఇది చూసి షాక్ అవుతారు.
ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోనే ఇందుకు నిదర్శనం. ఏటీఎం మిషన్ నుంచి రూ. 200 నకిలీ నోట్లు బయటకు వస్తున్న ఈ వీడియోను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నిజమైన నోటులా కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే ఈ నోట్‌లో మార్పులు చూడవచ్చు. ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా అనే పదాలు ప్రత్యేకంగా గమనించాలి!
ఏటీఎంలలో నకిలీ నోట్లను పంపిణీ చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ప్రజల్లో నిరసనలు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘యోగి ఆదిత్యనాథ్, మీరు దీన్ని సాధించారు! శాంతిభద్రతల పరిరక్షణలో మీకు సాటి ఎవరూ లేరు. ఏది అసలైన నోటు, ఏది నకిలీ నోటు అని ఇప్పుడు ప్రజలు కనిపెట్టగలుగుతున్నారు. ప్రజలను ఆశీర్వదించే మీ సామర్థ్యం ఆదర్శప్రాయం! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Congratulations Karmayogi @myogiadityanath you have done it. Your law & order has no comparison. Master Stroke by your Bankers under your guidance. Now, people able to find which is original and which is tampered note. Your style of educating people is exemplary. https://t.co/uZFv2pHjWA
— Voleti (@Voleti5) October 25, 2022
ఇంకా చాలా మంది నెటిజన్లు చాలా రకాలుగా స్పందించారు. ఒకరు దీన్ని స్మృతి ఇరానీ కా వికాస్ అంటే, మరొక వ్యక్తి దయచేసి బ్యాంకు పేరు చెప్పండి అంటున్నారు..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని మరొకరు ప్రశ్నించారు. డిజిటల్ ఇండియా వల్ల భారతదేశం నష్టపోతోందని మరొకరు కామెంట్ చేశరాఉ. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలంటూ మరొకరు డిమాండ్ చేశారు. మళ్లీ నోట్ల రద్దు సమయం వచ్చిందంటూ మరో నెటిజన్ అన్నారు. మరో వ్యక్తి బోలో జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేశారు. ఏదీ ఏమైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి