Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Benefits: రోజూ ఖాళీ కడుపుతో 4 తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఇది చాలా పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. తులసి మొక్కను నాటిన ఇంట్లో సంతోషానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదని చెబుతారు. ఈ మొక్క పచ్చి ఆకులను నమిలి తినడం వల్ల మధుమేహంతో సహా మరో ఇతర 5 ప్రధాన వ్యాధులను నయం చేస్తుంది.

Tulsi Benefits: రోజూ ఖాళీ కడుపుతో 4 తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Tulsi
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 26, 2022 | 2:54 PM

తులసి మొక్కలో లక్ష్మిదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఇది చాలా పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. తులసి మొక్కను నాటిన ఇంట్లో సంతోషానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదని చెబుతారు. అలాంటి తులసి కేవలం ఆధ్యాత్మిక మొక్క మాత్రమే కాదు, ఆయుర్వేద మొక్క కూడా. ఈ మొక్క పచ్చి ఆకులను నమిలి తినడం వల్ల మధుమేహంతో సహా మరో ఇతర 5 ప్రధాన వ్యాధులను నయం చేస్తుంది. ఆ వ్యాధులు ఏంటో, తులసి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

క్యారియోఫిలీన్, మిథైల్ యూజినాల్, యూజినాల్ వంటి కారకాలు మధుమేహాన్ని నియంత్రించడానికి తులసి ఆకుల రెమెడీలో అధికంగా ఉంటాయి. ఇది ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాలు సరిగ్గా పని చేయడానికి సహకరిస్తుంది. దీని కారణంగా, శరీరంలో ఇన్సులిన్ సమాన పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి మెరుగ్గా ఉండి మధుమేహం రాకుండా ఉంటుంది.

తలనొప్పికి పరిష్కారం తులసి ఆకుల నివారణ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. తులసి ఆకులు జలుబు, తలనొప్పి, అలర్జీ, సైనసైటిస్‌లో దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇందుకోసం ముందుగా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉంచాలి. తర్వాత కొద్దికొద్దిగా మింగేసి తాగాలి. మీరు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఒక అధ్యయన నివేదిక ప్రకారం.. మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టిసోల్‌ను తగ్గించడానికి తులసి ఆకు రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒత్తిడితో పోరాడుతున్న వారికి కూడా తులసి ఆకుల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 12 తులసి ఆకులను నమలడం ప్రారంభించండి. దీని ప్రయోజనాన్ని మీరు త్వరలో చూస్తారు.

గొంతునొప్పి వాతావరణం మారినప్పుడు గొంతు నొప్పి సహజం. ఈ గొంతు నొప్పిని తొలగించడానికి తులసి ఆకకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని ఫిల్టర్ చేసి, శుభ్రం చేసిన తర్వాత నెమ్మదిగా కొద్దికొద్దిగా తాగేయాలి. మీరు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

నోటి దుర్వాసనను తొలగిస్తుంది తులసి ఆకుల రెమెడీ నోటి దుర్వాసనను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను శుభ్రమైన నీటితో కడిగి..వాటిని కొద్దిగా నములుతూ ఉండంది..మీ నోటి దుర్వాసన పోతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి