AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సిఎం క్యాంపు కార్యాలయానికి కోడికత్తి శీను కుటుంబం.. స్పందన లో పిటిషన్..

ఆంధ్రప్రదేశ్ లో కోడి కత్తి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తన కుమారుడి బెయిల్ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని సీఎం జగన్ కు నిందితుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు...

Andhra Pradesh: సిఎం క్యాంపు కార్యాలయానికి కోడికత్తి శీను కుటుంబం.. స్పందన లో పిటిషన్..
Kodi Kathi Srinu Parents
Ganesh Mudavath
|

Updated on: Oct 26, 2022 | 1:45 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో కోడి కత్తి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తన కుమారుడి బెయిల్ కోసం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని సీఎం జగన్ కు నిందితుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు శీను కుటుంబ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. లాయర్ సలీమ్ తో పాటు శీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వచ్చారు. నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సీఎం చెప్పుకుంటామని శీను కుటుంబసభ్యులు వాపోతున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వినతి పత్రం ఇచ్చారు. నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కుమారుడు జైలు పాలైనందున తాము కష్టాలు పడుతున్నట్లు లేఖలో సీఎంకు వివరించారు. వయోభారంతో ఉన్న తమ పోషణ కష్టంగా మారిందని జాలి చూపాలని సీఎంకు నిందితుడి తల్లిదండ్రలు విజ్ఞప్తి చేశారు.

కాగా.. 2018 అక్టోబర్ 25న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక కు చెందిన జనిపల్లి శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శ్రీనును విడుదల చేయాలని తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడికి సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది కి బెయిల్ వచ్చిందని, తమ కుమారుడు శ్రీనుకి ఎందుకు బెయిల్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. కాగా.. శ్రీనుకు 2019 మే 25న కోర్టు బెయిల్ ఇచ్చింది. రెండు నెలల 15 రోజుల తరువాత 2019 ఆగస్టు 13 న బెయిల్ రద్దు చేసి మళ్లీ రిమాండ్ లో ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..