Anakapalle: పాపం చిన్నారి..!.. పుట్టిన మరుక్షణమే చెత్తబుట్టలో..

ఏ తల్లి పాపమో.. మరే తల్లి కర్కశత్వమో గానీ.. అభం శుభం తెలియని ఆ చిన్నారి అనాధగా మారింది. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన మరుక్షణమే చెత్త బుట్టలో పడింది. తల్లి పొత్తిళ్ల కోసం గుక్క పెట్టి..

Anakapalle: పాపం చిన్నారి..!.. పుట్టిన మరుక్షణమే చెత్తబుట్టలో..
New Born Baby
Follow us

|

Updated on: Oct 26, 2022 | 1:27 PM

ఏ తల్లి పాపమో.. మరే తల్లి కర్కశత్వమో గానీ.. అభం శుభం తెలియని ఆ చిన్నారి అనాధగా మారింది. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన మరుక్షణమే చెత్త బుట్టలో పడింది. తల్లి పొత్తిళ్ల కోసం గుక్క పెట్టి ఏడుస్తున్నా ఆమె మాత్రం కనీసం కనికరించలేదు. చెత్తబుట్టలో పడేసి కన్నెత్తైనా తిరిగి చూడలేదు. పసికందు ఏడుపు విని మానవత్వం ఉన్న మహిళలు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం ఏమీ కాదు. అనకాపల్లి జిల్లా ఎస్ ఈ జెడ్ లోని ఓ వస్త్ర పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం స్పెషల్ ఎకనామిక్స్ జోన్ బస్సు తయారీ పరిశ్రమలో కలకలం రేగింది. రోజు మాదిరిగానే బి షిఫ్ట్ విధులకు హాజరైన మహిళలంతా విధులు ముగించుకునే పనిలో ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో గాని.. వస్త్ర పరిశ్రమ వాష్ రూమ్ కి వెళ్ళిన ఓ మహిళకు చిన్నారి ఏడుపులు వినిపించాయి. చెత్తబుటలో తొంగి చూసేసరికి అందులో అప్పుడే పుట్టిన మగ శిశువు కనిపించింది. సహచర ఉద్యోగులకు ఆ మహిళ చెప్పడంతో అంతా కలిసి పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈలోగా చిన్నారిని హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అప్పటికే షిఫ్ట్ ముగించుకొని మహిళలు అంతా తిరుగు ప్రయాణం అవడంతో అలర్ట్ అయిన కార్మికులు యాజమాన్యం బస్సులో ఉన్న మహిళలను తనిఖీలు చేశారు. పలువురుని ప్రశ్నించారు. అనుమానిత మహిళను అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని జిల్లా ఉనతాధికారులకు, చైల్డ్ లైన్ ప్రతినిధులకు అందించారు.

ఖాజా, టీవీ9 తెలుగు, విశాఖపట్నం

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..