AP Weather: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. పూర్తి వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...
గురువారం పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం శుక్రవారం, సెప్టెంబర్ 6, 2024 ఉదయం 08:30 గంటలకు మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 3-4 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతుంది.
సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి బికనీర్, నార్నాల్, సిధి, సంబల్‌పూర్ , మధ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడి ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా కొనసాగుతున్నది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
శుక్రవారం, శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
శుక్రవారం, శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
రాయలసీమ :-
————————————–
శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.