AP Weather: అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!
అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. పూర్తి వెదర్ అప్ డేట్ తెలుసుకుందాం పదండి...

– వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిస్సా తీరానికి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది. రెండు రోజుల్లో దక్షిణ ఝార్ఖండ్ ఉత్తర ఒడిస్సా మీదుగా పశ్చిమ వాయువదిశగా ప్రయాణించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వర్షాలు ఎక్కడంటే..!
అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడుతుందని ఐఎండి ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.
గత రాత్రి విశాఖలో భారీ వర్షం..
గతరాత్రి విశాఖలో భారీ వర్షం కురిసింది. గంట పాటు ఉరుములు, మెరుపులతో పాటు కుండ పోతగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూర్ణ మార్కెట్, జ్ఞానాపురం తో పాటు కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. పల్లపు ప్రాంతంలో వర్షం కాస్త ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి విశాఖలో ఆకాశం మేఘావృతమై ఉంది.
తెలంగాణలో కూడా….
తెలంగాణలో కూడా కొన్ని చోట్ల బధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. గురువారం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని.. దీంతో అక్టోబర్ మొదటి వారం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తిరోగమన సమయం దగ్గరపడటంతో.. రుతుపవనాలు పుంజుకుంటున్నాయని పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..