Fire Accident: హైవేపై హై స్పీడ్ లో కారు.. ఒక్కసారిగా మంటలు..! చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Srikar T

Nov 15, 2023 | 1:00 PM

 అనకాపల్లి హైవేపై ఓ కారు క్షణల్లో దగ్ధమైంది. తేరుకునే లోపే పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు కారును వెంటనే ఆపి కిందకు దిగడంతో డ్రైవర్‌కు ముప్పు తప్పింది. అనకాపల్లి జాతీయ రహదారి పై కొత్తూరు జంక్షన్ వద్ద అర్ధరాత్రి కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి గాజువాకకు వెళ్తున్నాడు.

Fire Accident: హైవేపై హై స్పీడ్ లో కారు.. ఒక్కసారిగా మంటలు..! చివరకు ఏం జరిగిందంటే..
Watch Car Catches Fire While Travelling On Anakapalli National Highway Video
Follow us on

అనకాపల్లి హైవేపై ఓ కారు క్షణల్లో దగ్ధమైంది. తేరుకునే లోపే పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు కారును వెంటనే ఆపి కిందకు దిగడంతో డ్రైవర్‌కు ముప్పు తప్పింది. అనకాపల్లి జాతీయ రహదారి పై కొత్తూరు జంక్షన్ వద్ద అర్ధరాత్రి కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి గాజువాకకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు అనకాపల్లి జాతీయ రహదారి కొత్తూరు వద్దకు వచ్చేసరికి ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే కారు ఆపి కిందకు దిగిపోయాడు నవీన్. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. వాటి నుంచి పొగలు వస్తుండటంతో చిన్నపాటి మంటలను ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ఘటన చూసిన వారంతా.. ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారేమో అని అనుకున్నారు. విషయం తెలుసుకున్నాక అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి