YSRCP vs TDP: ఏపీలో పొత్తులపై రాజకీయ దుమారం.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం..

|

Jul 23, 2023 | 7:28 AM

Andhra Pradesh Politics: ఏపీలో పొత్తులపై పవన్‌కల్యాణ్‌ రేపిన రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది. ఈ ఇష్యూపై వైసీపీ-టీడీపీ మధ్య వార్‌ నడుస్తోంది. ఎంతమంది కలిసొచ్చినా, సింహం..సింగిల్‌గానే వస్తుందని YV సుబ్బారెడ్డి కామెంట్‌ చేశారు.

YSRCP vs TDP: ఏపీలో పొత్తులపై రాజకీయ దుమారం.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం..
Andhra Pradesh Politics
Follow us on

Andhra Pradesh Politics: ఏపీలో పొత్తులపై పవన్‌కల్యాణ్‌ రేపిన రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది. ఈ ఇష్యూపై వైసీపీ-టీడీపీ మధ్య వార్‌ నడుస్తోంది. ఎంతమంది కలిసొచ్చినా, సింహం..సింగిల్‌గానే వస్తుందని YV సుబ్బారెడ్డి కామెంట్‌ చేశారు. ఐతే వైసీపీ అంటరానిపార్టీ కాబట్టే, జగన్‌తో ఎవరు జతకట్టరని విమర్శించారు సోమిరెడ్డి. ఇంతకీ..పొత్తు రాజకీయాలపై ఎవరి వెర్షన్‌ ఏంటో చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌లో వారం-పది రోజులుగా పొత్తులపై రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ వేడి మరింత రాజుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేసే ఛాన్స్‌ కొట్టిపారేయ్యలేమన్నారు పవన్‌. దాంతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా చాలా బలమైన సంభాషణ కూడా జరిగినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు విపక్షాల ట్రయాంగిల్‌ కూటమికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏపీలో విపక్షాల పొత్తుల వ్యవహారంపై అధికార వైసీపీ వరుసగా కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ప్రతిపక్షాలు ఎలా వచ్చినా సిద్దమే అన్నారు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక..పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు వైవీ.

ఇవి కూడా చదవండి

సీఎం జగన్‌ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని..అందుకే పవన్ చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. పవన్‌కు దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలని జగన్‌ సవాల్‌ విసురుతున్నారని, మరి ఆయన తండ్రి YS.రాజశేఖర్‌రెడ్డి గతంలో దమ్ములేకపోవడం వల్లే పొత్తులు పెట్టుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అస్సలు వైసీపీ అనేది ఓ అంటరాని పార్టీ అని, జగన్‌తో పొత్తుకు ఎవరు సిద్ధంగా లేరని విమర్శించారు సోమిరెడ్డి.

ఏదిఏమైనా.. పవన్‌ పొత్తు ముచ్చట్లపై అధికార-విపక్షాల మధ్య వార్‌ కంటిన్యూ అవుతోంది. మరి ఎన్నికలొచ్చేనాటికి ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..