Vizag Steel Plant: మరింత నష్టాల్లోకి వైజాగ్ స్టీల్ ప్లాంట్.. గంగవరం పోర్టు కూడా కారణమేనా?

| Edited By: Shiva Prajapati

Jul 15, 2023 | 8:09 PM

Visakhapatnam, July 15: స్టీల్ ప్లాంట్ వర్సెస్ అదానీ గంగవరం పోర్టు వివాదంతో స్టీల్ ప్లాంట్ మరింత సంక్షోభంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం రెండు వేల మెట్రిక్ టన్నుల కోకింగ్ కోల్‌తో విదేశాల నుంచి గంగవరం పోర్ట్ కు వచ్చిన ఓడలు పోర్టులో దిగుమతికి నోచుకోకపోవడం చర్చనీయాంశం అయింది.

Vizag Steel Plant: మరింత నష్టాల్లోకి వైజాగ్ స్టీల్ ప్లాంట్.. గంగవరం పోర్టు కూడా కారణమేనా?
Vizag Steel Plant
Follow us on

Visakhapatnam, July 15: స్టీల్ ప్లాంట్ వర్సెస్ అదానీ గంగవరం పోర్టు వివాదంతో స్టీల్ ప్లాంట్ మరింత సంక్షోభంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం రెండు వేల మెట్రిక్ టన్నుల కోకింగ్ కోల్‌తో విదేశాల నుంచి గంగవరం పోర్ట్ కు వచ్చిన ఓడలు పోర్టులో దిగుమతికి నోచుకోకపోవడం చర్చనీయాంశం అయింది. సాధారణంగా 48 నుంచి 72 గంటల వరకూ దిగుమతికి నోచుకోకపోతే పెద్ద నౌకలైతే 45 వేల డాలర్లు అంటే 36లక్షల రూపాయల డెమరేజ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్లాంటు అధికారులు ప్రశ్నించగా పాత బకాయిలున్నాయని, అవి చెల్లిస్తేనే దిగుమతి చేస్తామని అదానీ అధికారులు చెప్పడంతో ఖంగుతిన్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేయాలో పాలుపోక బెంబేలెత్తి పోతోంది.

అసలే నష్టాలు ఒక వైపు, మరోవైపు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయించడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ లేక నానా అవస్థలు పడుతున్న స్టీల్ ప్లాంట్ కు అదానీ పోర్ట్ రూపంలో మరింత నష్టం చేకూరుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీ‌ల్ ప్లాంట్‌ ను కేంద్రం ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తూండంగా ఆ సంస్థ నుంచి వీలైనంత పిండుకోవడానికి గంగవరం పోర్టు కొత్త యాజమాన్యం ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదానీ పోర్ట్ సంస్థ గంగవరం పోర్టును పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు చార్జీలు పెంచేస్తోంది. పెంచిన చార్జీలు ఇవ్వకపోతే దిగుమతి అయిన సరుకును ఇవ్వబోమంటూ సొంత గోడౌన్లకు తరలించడం తరచూ వివాదాస్పదం అవుతోంది. వాస్తవానికి గంగవరం పోర్టు నిర్మాణం కోసం స్టీల్ ప్లాంట్ 1100 ఏకరాల భూమిని ఇచ్చింది. ఆ ఒప్పందంలో భాగంగా 2011 నుంచి 2026 వరకు ఎలాంటి పోర్ట్ హాండ్లింగ్ చార్జీలు పెంచవద్దని ఒప్పందం కూడా ఉంది. కానీ దానికి భిన్నంగా ఛార్జ్ లను పెంచేసింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

గంగవరం పోర్టుకు ఎక్కువ వ్యాపారం అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తమ ఉక్కు ఉత్పత్తుల కోసం అవసరం అయ్యే ముడి సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో తయారయ్యే ఉక్కును శుద్ధి చేయడానికి ఉపయోగించే లైమ్‌ స్టోన్‌, డోలమైట్, ఉక్కు తయారీకి అవసరమైన కోకింగ్‌ కోల్‌లను దుబాయ్ లాంటి గల్ఫ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల్ని గంగవరం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తూంటారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఎగుమతి, దిగుమతుల ద్వారానే గంగపోరం పోర్టు కు భారీ ఆదాయం సమకూరుతుంది

ఇవి కూడా చదవండి

దుబాయ్ నుంచి దిగుమతి అవుతున్న లైమ్ స్టోన్‌ను ప్రత్యేక కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్ ప్లాంట్ తరలించేందుకు ప్రస్తుతం చెల్లిస్తున్న దాని కంటే అదనంగా 125 రూపాయలు చెల్లించాలని పట్టుబడుతోంది. అదానీ డిమాండ్ చేస్తున్న ప్రకారం చెలిస్తే 21 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్‌కు ఏడాదికి అదనపు వ్యయం అవుతుంది. నిజానికి గంగవరం పోర్టుతో స్టీల్ ప్లాంట్‌కు చార్జీల ఒప్పందం ఉంది. 2011లో జరిగిన ఈ ఒప్పందం 2026 వరకు అమలులో ఉంటుంది. అప్పటి వరకూ పోర్టు చార్జీలు పెంచకూడదు. కానీ కొత్త యాజమాన్యం చార్జీలు పెంచేసింది. కుదరదని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్పడంతో గతంలోనే దిగుమతి అయిన లైమ్ స్టోన్‌ను సొంత గోడౌన్లకు మళ్లించారు. దీంతో ఉత్పత్తికి ఇబ్బంది అవుతుందని పోర్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది.

స్టీల్‌ప్లాంటు ఏడాదికి 18 లక్షల టన్నుల లైమ్‌స్టోన్‌ను దిగుమతి చేసుకుంటోంది. టన్నుకు 120 రూపాయల చొప్పున ఎక్కువ చెల్లించాలని అదాని పోర్టు ఆదేశించడంతో ఏడాదికి 21 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లైమ్ స్టోన్ దిగుమతులకే రేట్లు పెంచితే.. కోకింగ్ కోల్ దిగుమతికి కూడా అదే పని చేస్తారని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్న సమయంలోనే అనుకున్నంత పనైంది. ఇప్పుడు కొకింగ్ కోల్ కోసం టన్నుకు 55 రూపాయలు ఎక్కువ పెంచి, మేరకు 50 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని, దాన్ని వెంటనే చెల్లించాలని తాజాగా వచ్చిన రెండు ఓడల నుంచి దిగుమతి చేసుకోకుండా ఆపేసింది. దీంతో అసలే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితులు అదనపు భారం గా, ఇబ్బందికరంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..