AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: విశాఖలో తప్పిన పెను ప్రమాదం.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన ఆర్టీసీ బస్సు!

విశాఖ నగరంలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు నిమిషాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో కొద్ది సేపట్లో ఆబస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Andhra News: విశాఖలో తప్పిన పెను ప్రమాదం.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన ఆర్టీసీ బస్సు!
Visakhapatnam Bus Fire
Anand T
|

Updated on: Sep 12, 2026 | 9:19 AM

Share

విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే ఆ బస్సులు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులో ప్రయానికులును ఎక్కించుకున్న బస్సులు సుదీర్ఘ ప్రయాణం తర్వాత విశాఖకు చేరుకుంది. అక్కడ ప్రయాణికులు దిగిపోయిన తర్వాత బస్సును పక్కనే ఉన్న వాల్తేరు డిపో వద్ద ఆపారు సిబ్బంది.

అయితే, శనివారం ఉదయం ఒక్కసారిగా బస్సు ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు వచ్చాయి, తర్వాత కొద్దిసేపటికే ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించి అది పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగుతున్న దాన్ని గమనించిన స్థానికులు సిబ్బంది వెంటనే పోలీసుల కు,అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఉన్నతాధి కారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీ లించారు. బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేదైనా సాంకేతిక లోపమా, అనే కోణంలో పోలీసులు ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us