AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు.. గణేష్ నిమజ్జనం కోసం చెరువుల్లో నీరు కరువయ్యాయని ఆందోళనలో ఉన్న భక్తులకు వరుణుడు శుభవార్త చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్పపీడనం బలపడి, ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మరి శనివారం ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో చూద్దాం.

Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Weather Forecast For Andhra Pradesh And Telangana
Anand T
|

Updated on: Sep 12, 2026 | 6:42 AM

Share

ఎల్‌నీనో ప్రభావంతో వర్షాకాలంలో కూడా వానలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాబావంతో చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు అడుగంటి పోయాయి. దీనికి తోడు ప్రస్తుతం వినాయకచవితి పండగ వచ్చేసింది. ఇప్పడు గణపయ్యను నిమజ్జనం చేద్దామన్న చెరువుల్లో పెద్దగా నీరు కనిపించడం లేదని కంగారుపడుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారంతో పాటు రాబోయే వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా!

వాయువ్య- పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శనివారం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వాతావరణ శాఖ ప్రకారం.. శనివారం శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు ; విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

తెలంగాణలో వాతావరణం ఇలా!

ఇక తెలంగాణలోనూ శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, పెద్దపల్లి అంతటా ఓ మోస్తరు వర్షాలు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, నిజామాబాద్ అంతటా మోస్తరు వర్షాలతో పాటు చెదురుమదురు గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో వాతవరణం ఇలా!

అలాగే రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లోని అమీన్‌పూర్, దుండిగల్, బాచుపల్లి, నిజాంపేట్, మల్లంపేట్, బొల్లారం, కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, బాలానగర్, అల్వాల్, మల్కాజిగిరి, యాప్రాల్, మేడ్చల్, తదుపరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా
హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా
వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా
17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్
17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్
యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్
యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్
తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌
తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌
ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు
ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు
సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశులకు కెరీర్‌లో పురోగతి
సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశులకు కెరీర్‌లో పురోగతి
చిరంజీవి సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టిన ఇద్దరు స్టార్స్
చిరంజీవి సినిమాలు రీమేక్ చేసి హిట్ కొట్టిన ఇద్దరు స్టార్స్