AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండాలి..? ఇలా చేస్తే మీకు లాభమే.. లాభం.. అసలు మిస్సవ్వకండి..

రోజువారీ అవసరాల కోసం చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తుంటారు. ఎక్కువ అకౌంట్లు ఉండటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ చేయకపోతే భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. అసలు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే మంచిది..?

Venkatrao Lella
|

Updated on: Sep 12, 2026 | 8:52 AM

Share
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను చాలామంది కలిగి ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి శాలరీ అకౌంట్‌తో పాటు సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇక వ్యాపారులు కరెంట్ అకౌంట్‌తో పాటు సేవింగ్స్ అకౌంట్లు కలిగి ఉంటారు. మిగతా వర్గాలవారు వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఒక అకౌంట్, రోజువారీ అవసరాలకు ఖర్చు పెట్టుకునేందుకు మరో ఖాతా నిర్వహిస్తూంటారు

1 / 5
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే.. అందుకోసం ప్రత్యేకంగా మరో ఖాతా నిర్వహిస్తుంటారు. పొదుపు కోసం ప్రత్యేక అకౌంట్ ఉండటం మంచిదే. దీని వల్ల దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామనే  విషయాలు సులువుగా తెలుసుకోవచ్చు. అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల ఏమవుతుంది..? ఎన్ని ఖాతాలు ఉంటే మంచిది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఆదాయం, ఖర్చులు ఎక్కువగా లేకపోతే రెండు అకౌంట్లు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక అకౌంట్‌ను జీతం కోసం ఉపయోగిస్తుంటే.. రోజువారీ ఖర్చులు, బిల్లుల చెల్లింపు కోసం ఆ అకౌంట్ ఉపయోగించాలి. ఇక రెండో సేవింగ్స్ అకౌంట్‌ను డబ్బులు పొదుపు చేసుకునేందుకు వాడాలి. దీని వల్ల అవసరమైన ఖర్చులను నియంత్రించడంతో పాటు ప్రతీ నెలా ఎంత నగదు ఖర్చు అవుతుంది.. ఎంత పొదుపు  అవుతుందనేది తెలుసుకోవచ్చు.

3 / 5
ఒక వ్యక్తికి ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు మూడో అకౌంట్ కలిగి ఉంటే మంచిదే. వేరే ప్రాంతానికి మారినప్పుడు లేదా ఏదైనా బ్యాంక్ అందించే సేవలు అవసరమైనప్పుడు మూడో ఖాతా ఓపెన్ చేయాలి. అయితే మూడు కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల నష్టం జరుగుతుంది. బ్యాంక్ ఏటీఎం, ఎస్ఎంఎస్, కనీస బ్యాలెన్స్ ఛార్జీల వల్ల లాభదాయకంగా ఉండదు

4 / 5
వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే డిపాజిట్లు, మీకు వచ్చే వడ్డీపై DICGC నిబంధనల ప్రకారం రూ.5 లక్షల బీమా రక్షణ ఉంటుంది. దీంతో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ప్రతీ బ్యాంకులో కవరేజీ లభిస్తుంది. దీని వల్ల మీ డబ్బులకు రక్షణ ఉంటుంది.

5 / 5
Follow Us