తొలి కాన్పులోనే ముగ్గురు పిల్లలకు జననం !

స్త్రీ జీవితంలో గర్భధారణ మరపురాని ఘట్టం. కాన్పు మరింత మధురమైన జ్ఞాపకం. అందులోనూ సహజ ప్రసవం ద్వారా జన్మించడం ఆరోగ్యరీత్యా బిడ్డకు చాలా మంచిది. సీజేరియన్ చాలా సాధారణమైన ఈ రోజుల్లో ఓ మహిళ తొలి కాన్పులోనే నార్మల్ డెలవరీ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

తొలి కాన్పులోనే ముగ్గురు పిల్లలకు జననం !
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 9:44 PM

స్త్రీ జీవితంలో గర్భధారణ మరపురాని ఘట్టం. కాన్పు మరింత మధురమైన జ్ఞాపకం. అందులోనూ సహజ ప్రసవం ద్వారా జన్మించడం ఆరోగ్యరీత్యా బిడ్డకు చాలా మంచిది. సీజేరియన్ చాలా సాధారణమైన ఈ రోజుల్లో ఓ మహిళ తొలి కాన్పులోనే నార్మల్ డెలవరీ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ రోజుల్లో చాలా వరకూ సిజేరియన్లే అవుతున్నాయి. సహజ ప్రసవాలు జరగడం చాలా తక్కువ. ఫీజులు ఎక్కువ వసూలు చేసుకొనేందుకు ప్రయివేటు ఆస్పత్రి యాజమాన్యాలు సిజేరియన్లకే మొగ్గు చూపుతారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా సహజ ప్రసవం చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. పరిస్థితులు అనుకూలించని పక్షంలోనే శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీస్తుంటారు. అయితే, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ సహజ ప్రసవం ద్వారా ముగ్గురు శిశువులకు జన్మించారు. చాలా మందిలో ఒక బిడ్డకే సహజ ప్రసవానికి పరిస్థితులు అనుకూలించని ఈ రోజుల్లో ఆ మహిళ ఏకంగా ముగ్గురు పిల్లలకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో నారాయణపేట పట్టణం పళ్ళ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈమెకు ఇది తొలి కాన్పు కావడం మరో విశేషం. ఆ మహిళకు పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీతో పురుడు పోశారు. ఈ ముగ్గురు శిశువుల్లో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉండడం విశేషం. ప్రసవం అనంతరం ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అందిస్తున్న చక్కని వైద్య సేవలకు ఈ ప్రసవం ఒక ఉదాహరణగా పలువురు చెప్పుకుంటున్నారు.