షాకింగ్: తెలంగాణలో 23 మంది జర్నలిస్టులకు కరోనా..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ హైదరాబాద్‌ నగరంలో కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోంది. నిరంతరం వార్తల సేకరణలో ఉండే విలేకరులపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా హైదరాబాద్‌ నగరంలో కొత్తగా 23 మంది జర్నలిస్టులు...

షాకింగ్: తెలంగాణలో 23 మంది జర్నలిస్టులకు కరోనా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 14, 2020 | 9:02 PM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ హైదరాబాద్‌ నగరంలో కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోంది. నిరంతరం వార్తల సేకరణలో ఉండే విలేకరులపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా హైదరాబాద్‌ నగరంలో కొత్తగా 23 మంది జర్నలిస్టులు ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. ఓ ప్రముఖ ఛానెల్ రిపోర్టర్ మనోజ్ మృతితో.. చాలా మంది జర్నలిస్టులు కరోనా టెస్టులు చేయించుకోవడాని ముందుకు రాగా కొత్త కేసులు బయటపడ్డాయి.

ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 140 మంది జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయగా అందులో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జర్నలిస్ట్ వర్గాల్లో కాస్త ఆందోళన నెలకొంది. గత మూడు నెలలుగా కరోనాని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కోవిడ్ పాజిటివ్ రావడం విషాదకరం. ఇప్పటికే గాంధీలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వార్డును కేటాయించారు. దానికి మనోజ్ కుమార్ పేరును నామకరణం చేశారు.

Read More: 

కరోనా వ్యాప్తిపై సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్…

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి