Visakhapatnam: ఆగని ఆవుల మరణ మృదంగం.. ఆశ్రమంలో మరో నాలుగు గోవుల మృతి

గోవును ఆరాధిస్తే..సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతాయి. అందుకే ఆవును గోమాత అని పిలుస్తారు. అలాంటి కామధేనువులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి.

Visakhapatnam: ఆగని ఆవుల మరణ మృదంగం.. ఆశ్రమంలో మరో నాలుగు గోవుల మృతి
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 18, 2021 | 11:29 AM

గోవును ఆరాధిస్తే..సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతాయి. అందుకే ఆవును గోమాత అని పిలుస్తారు. అలాంటి కామధేనువులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. గోవుల మూగరోధనతో ఆ ఆశ్రమమే మసక బారిపోయింది. సరైన పశుగ్రాసం, నీళ్లు లేక డొక్కలు ఎండిపోయి చనిపోతున్నాయి.  విశాఖపట్నం రామానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదు. ఆశ్రమంలో దాణాలు లేక నిన్న 13 గోవులు మృతిచెందితే… ఇవాళ కూడా ఉదయం మరో నాలుగు ఆవులు మృతిచెందాయి. దీంతో మొత్తం 17 ఆవులు మృతిచెందాయి.  విశాఖ వెంకోజిపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల శవాల దిబ్బ కలకలం రేపింది. పశుగ్రాసం-నీళ్లు లేక మృత్యువాత పడుతున్నాయి. దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి. రామానంద ఆశ్రమంలో ఆకలితో 160 గోవులు అల్లాడుతున్నాయి.

శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా తరలివస్తున్న 160 గోవులను పట్టుకుని రామానంద ఆశ్రమంలో అధికారులు వదిలేసి వెళ్లారు. కేవలం 20 ఆవులకే నివాసం ఉన్న ఆశ్రమంలోకి, నాలుగు రోజుల క్రితం 160 కొత్త గోవులను తీసుకొచ్చారు. లారీల్లో తీసుకొచ్చిన వాటిల్లో ఆవులు తీవ్రంగా గాయపడి ఉన్నాయి. వాటిని పోలీసులు తమ ఆశ్రయంలో వదిలేసి వెళ్లిపోయారని ఆశ్రమ గోసేవ నిర్వాహకులు చెబుతున్నారు.

నిన్న ఆవుల మరణాలపై టీవీ9 వరుస కథనాలతో అధికారులు స్పందించారు. పశు సంవర్ధశాఖ అధికారులు ఆశ్రమానికి చేరుకొని, అనారోగ్యంగా ఉన్న ఆవులను పరీక్షించి మందులు వేశారు. సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని చెబుతున్నారు అధికారులు. అయితే ఇవాళ కూడా మరో నాలుగు అవులు చనిపోవడం విషాదం నింపింది.

జ్ఞానానంద ఆశ్రమాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శుక్రవారంనాడు సందర్శించారు. పశువులకు స్వయంగా తనచేతులతో దాణా అందించారు. గోవుల మృతిచెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెలగపూడి….ఒకేసారి పది ఆవులు మృతి చెందటం చాలా దారుణమన్నారు. గోవుల మృతికి ప్రధాన కారణం దేవాదాయశాఖ అధికారులు, పోలీసులేనని ఆరోపించారు. అక్రమంగా బయటి రాష్ట్రాలకు తరలిస్తున్న గోవులను పట్టుకుంటున్న పోలీసులు.. ఆశ్రమానికి అప్పజెబుతున్నారనీ… దీనిపై దేవాదాయ శాఖ అధికారులకు ఎటువంటి సమాచారం లేదనీ విమర్శించారు. తక్షణం ఇక్కడి గోవులకు తక్షణం వైద్య సేవలు అందించి… దానా , తాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ కు కూడా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు ఎమ్మెల్యే.

Also Read..

Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

Minister Cleans Toilet: విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన ప్రజాప్రతినిధి.. పాఠశాల టాయిలెట్స్ స్వయంగా క్లీన్ చేసిన మంత్రి!