AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Cleans Toilet: విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన ప్రజాప్రతినిధి.. పాఠశాల టాయిలెట్స్ స్వయంగా క్లీన్ చేసిన మంత్రి!

ఎన్నికల ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు రకరకాల వేషాలు వేస్తుంటారు. ఏ ఎన్నికలు లేకుండానే ఓ మంత్రి చేస్తున్న పనులు చూసిన జనం శభాష్ అంటున్నారు.

Minister Cleans Toilet: విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన ప్రజాప్రతినిధి.. పాఠశాల టాయిలెట్స్ స్వయంగా క్లీన్ చేసిన మంత్రి!
Minister Pradhuman Singh Tomar
Balaraju Goud
|

Updated on: Dec 18, 2021 | 11:01 AM

Share

Madhya Pradesh Minister Cleans Toilet: ఎన్నికల ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు రకరకాల వేషాలు వేస్తుంటారు. ఏ ఎన్నికలు లేకుండానే ఓ మంత్రి చేస్తున్న పనులు చూసిన జనం శభాష్ అంటున్నారు. మధ్యప్రదేశ‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని మురుగుదొడ్డిని స్వయంగా శుభ్రం చేసిన ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మరుగుదొడ్లను శుభ్రం చేసిన తర్వాత పరిశుభ్రత ముఖ్యమని ఆయన సందేశాన్ని ఇచ్చారు.

పాఠశాలలో పరిశుభ్రత పాటించడంలేదని ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులకు చెప్పకుండానే స్వయంగా మంత్రి వచ్చి టాయిట్స్ శుభ్రం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో పాఠశాల సిబ్బందితో సహా మున్సిపల్ అధికారులు అవాక్కయ్యారు. పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

“పాఠశాలలోని మరుగుదొడ్లలో పరిశుభ్రత లేదని, దాని వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక బాలిక నాతో చెప్పింది” అని మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ చెప్పారు. “నేను 30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ చేసాను. ప్రతి రోజు ఏదో ఒక సంస్థకు వెళ్లి దానిని శుభ్రం చేస్తాను, శుభ్రత సందేశం ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నాను,” అని మంత్రి చెప్పారు.

Read Also… Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?