AOB: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రెండు మందు పాతరలు స్వాధీనం.. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టుల ఐఈడీలు
Andhra Odisha Border: విశాఖ ఏజన్సీ ఏవోబీలో రెండు మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు ఈ మందుపాతరలని..
Andhra Odisha Border: విశాఖ ఏజన్సీ ఏవోబీలో రెండు మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు ఈ మందుపాతరలని పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మందుపాతరల వల్ల భద్రతా బలగాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు ఏర్పాటు ఏర్పాటు చేసిన రెండు మందుపాతరలను గుర్తించారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా జొడొంబో పోలీసు స్టేషన్ పరిధిలో జాజుపాలెం-కెందుగూడ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రహదారిలో ఏర్పాటుచేసిన రెండు టిఫిన్ ఐఈడీలను బీఎస్ ఎఫ్ మరియు ఒడిశా పోలీసులు సంయుక్తంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గాలింపులకు వస్తున్న ఆంధ్రా-ఒడిశా బలగాలను తుదముట్టించడానికి నిర్మాణంలో ఉన్న రహదారిని మావోయిస్టులు ఎంచుకుని ఈ రెండు మందుపాతరలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పక్కా సమాచారం అందుకున్న ఒడిశా పోలీసులు, బీఎస్‌ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. తమ గాలింపు చర్యల్లో బయట పడ్డ ఈ రెండు మందు పాతరలను బ్యాంబ్ స్వ్కాడ్‌ను రప్పించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. కాగా, ఒక్కో మందు పాతర2.5 కిలోల బరువు ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇవీ కూడా చదవండి:
Family Suicide: దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. ఘటన స్థలంలో సూసైడ్ నోట్