Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢ నమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది

విశాఖ ఏజెన్సీలో మూఢనమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని దారుణంగా కొట్టి చంపేశారు కొందరు గ్రామస్తులు.

Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢ నమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది
Black Magic
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 21, 2021 | 1:24 PM

Black magic murder: విశాఖ ఏజెన్సీలో మూఢనమ్మకం ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని దారుణంగా కొట్టి చంపేశారు కొందరు గ్రామస్తులు. డుంబ్రిగూడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామమిది. డుంబ్రిగూడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో కేవలం 20 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. అంతా పిటిజి తెగకు చెందిన గిరిజనులే.

20 గడపల్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా దగ్గర బంధువులు. అయితే.. ఆ గ్రామంలో గత కొంత కాలంగా కొందరు మృతిచెందారు. చేతబడి కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయన్న అంధవిశ్వాసం ఆ గిరిజనుల కళ్ళను కమ్మేసింది. చేతబడికి మూల కారణం 40 ఏళ్ల కిలో కళ్యాణ అని వారిలో వారే నిర్ణయించుకున్నారు. పాత కక్షల కూడా తోడవడంతో.. ఇక ఆ ప్రాంతంలో కళ్యాణ పై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా కల్యాణ ను వదిలించుకోవాలని ప్లాన్ చేశారు. పొలం పనులకు తన కొడుకుతో పాటు వెళ్తున్న కిలో కళ్యాణ ను అడ్డగించారు కొంతమంది.

అక్కడే తోటి గిరిజనం అంతా కళ్యాణతో వాగ్వాదానికి దిగి.. తమతో తెచ్చిన మారణాయుధాలతో కళ్యాణ పై దాడి చేశారు. కళ్ళముందే కళ్యాణ ను అతి దారుణంగా చంపేశారని కొడుకు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భార్య లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కళ్యాణ హత్యతో పరిసర గ్రామాలన్నీ ఉలిక్కిపడ్డాయి. మూఢ నమ్మకమే కళ్యాణ ప్రాణం తీసింది అని అంటున్నారు సర్పంచ్ సుబ్బారావు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ ను హత్య లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఖాజా, టీవీ9 ప్రతినిధి, వైజాగ్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!