Chandrababu: ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టడం ఏంటి?.. చాలామంది ఎగిరిపోతారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఓ వ్యక్తి విలాసాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు..సీఎం చంద్రబాబు. జగన్‌ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను..ముఖ్యమంత్రి పరిశీలించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చని జగన్‌ ప్రభుత్వం..ప్యాలెస్‌ కోసం 430 కోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. ప్రజల నుండి వచ్చే సూచనల మేరకే రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Chandrababu: ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టడం ఏంటి?.. చాలామంది ఎగిరిపోతారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 02, 2024 | 9:18 PM

రుషికొండ భవనాల నిర్మాణం ముమ్మాటికీ నేరమే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. భవన నిర్మాణాల తీరు.. నిబంధనల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు. పూర్తి విచారణ జరిపి శిక్షిస్తామని హెచ్చరించారు.. రుషికొండపై నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు.. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో హెచ్చరికలు కూడా పంపారు. ఒక వ్యక్తి విలాసం కోసం వందల కోట్లు పెట్టి రుషికొండ భవనాలు నిర్మించారు. ఏ ఒక్క నిబంధన కూడా పాటించలేదు. ఇది ముమ్మాటికీ నేరమే. ఈ నేరంలో భాగమైన వారికి శిక్షపడాల్సిందే. విచారణ చేపట్టి అందరినీ బయటకు లాగుతామంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రకృతిని విధ్వంసం చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండ భవనాలను నిర్మించారని పేర్కొన్నారు. కోర్టును కూడా తప్పదోవ పట్టించారన్నారు. ఇప్పుడు అసలు వాస్తవాలు కోర్టు ముందు ఉంచుతామంటున్నారు. పూర్తిగా విచారణ చేస్తే ఈ కేసులో చాలామంది ఎగిరిపోతారని అంటున్నారు సీఎం చంద్రబాబు.

కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని భవనాలు కట్టారు. కోర్టులు, కేంద్రాన్ని కూడా మభ్యపెట్టి.. నిబంధనలన్నీ ఉల్లంఘించి.. మంచినీళ్లలా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఈ భవనాల విషయంలో నేరం జరిగిపోయింది. ఇక శిక్ష వేయడమే మిగిలి ఉందన్నారు. ఇంత నేరం చేసిన వాళ్లను వదిలెయ్యాలా? ప్రజాకోర్టులో శిక్షించవద్దా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..