AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త షెడ్యూల్‌ ఇదే!

పలు రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న భర్తీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు త్వరలో నిర్వహించనున్న సీబీటీ పరీక్షల తేదీలు మారాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన జారీ చేసింది. కొత్త తాత్కాలిక తేదీలను ఆర్‌ఆర్‌బీ..

RRB Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త షెడ్యూల్‌ ఇదే!
RRB Technician Revised Exam Date
Srilakshmi C
|

Updated on: Feb 26, 2026 | 6:41 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న భర్తీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు త్వరలో నిర్వహించనున్న సీబీటీ పరీక్షల తేదీలు మారాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన జారీ చేసింది. కొత్త తాత్కాలిక తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల తాజాగా పరీక్ష తేదీలను మరోమారు మార్చింది. ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈ మేరకు మారిన తేదీలను గమనించి తదనుగుణంగా తమ ప్రిపరేషన్ సాగించాలని బోర్డు సూచించింది.

సిటీ సమాచార స్లిప్‌ను పరీక్షకు 10 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా నగరాన్ని ఇందులో తనిఖీ చేసుకోవచ్చు. RRB టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 పరీక్ష తేదీకి 4 రోజుల ముందు విడుదల చేస్తారు. ఇందులో ఖచ్చితమైన పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం, పరీక్షా కేంద్రం వివరాలు ఉంటాయి. ఆయా తేదీల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు, మూడో షిఫ్ట్‌ సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాల రాత పరీక్ష కొత్త షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా దేశంలోని పలు రైల్వే జోన్లలో వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌, టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. RRB టెక్నీషియన్ రివైజ్డ్ ఎగ్జామ్ డేట్ 2026 PDFని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us