RRB Group D Recruitment: నిరుద్యోగులకు తీపికబురు.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన షార్ట్ నోటీఫికేషన్ ను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది..
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దాదాపు 32,438గ్రూప్-డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఈ పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిలో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు తుది గడువు ఫిబ్రవరి 22వ తేదీతో ముగుస్తుంది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్ధులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 వరకు జీతంగా చెల్లిస్తారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు, అర్హతలు, సిలబస్, ఎంపిక విధానం వంటి తదితర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ జారీ తర్వాత తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు…
- వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 23, 2025.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 23, 2025.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.