AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Answer Key 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ సీబీటీ 1 ఆన్‌లైన్‌ పరీక్షలు ఫిబ్రవరి 13, 16, 17, 18 తేదీల్లో జరిగిన సంగతి..

RRB Answer Key 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
RRB ALP Answer Key
Srilakshmi C
|

Updated on: Mar 20, 2026 | 3:56 PM

Share

హైదరాబాద్, మార్చి 20: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ సీబీటీ 1 ఆన్‌లైన్‌ పరీక్షలు ఫిబ్రవరి 13, 16, 17, 18 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రాధమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఒక్కో ప్రశ్నకు రూ.50 చొప్పున చెల్లించి మార్చి 20 నుంచి 26 వరకు తెలిపేందుకు అవకాశం కల్పించింది.

ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌షీట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలు ప్రకటిస్తారు. సీబీటీ 1 పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలతో లాగిన్‌ అయి ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీబీటీ 1లో అర్హత సాధించిన వారు సీబీటీ 2 పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్షలు, వైద్య పరీక్షలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌షీట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఐఐటీ జామ్ 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) 2026 ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఐటీ జామ్ 2026 స్కోర్ కార్డ్‌లు మార్చి 27 అధికారిక వెబ్‌సైట్‌ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని ఐఐటీ బాంబే వెల్లడించింది.

ఐఐటీ జామ్ 2026 ఫలితాల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు