Vizag Rainbow Hospital: చిన్నారులకు ప్రాణదాత రెయిన్‌బో చిల్ట్రన్ ఆస్పత్రి.. నెలలు నిండని శిశువులకు ప్రాణం పోసిన వైద్యులు
Vizag Rainbow Hospital: కొన్ని పిల్లల ఆస్పత్రులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిన్నారులకు ప్రాణాలు పోస్తుంటాయి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను బతికించేందుకు వైద్యులు ఎంతో శ్రమించాల్సి వస్తుంటుంది..
Vizag Rainbow Hospital: కొన్ని పిల్లల ఆస్పత్రులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిన్నారులకు ప్రాణాలు పోస్తుంటాయి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను బతికించేందుకు వైద్యులు ఎంతో శ్రమించాల్సి వస్తుంటుంది. అలాంటి ఆస్పత్రుల్లో వైజాక్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి. కేవలం 26 వారాలకే 430 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు వైద్యులు ప్రాణం పోశారు. అర్జున్‌వర్మ అనే శిశువు అతి తక్కువ బరువుతో జన్మించడంతో వైద్యులు 85 రోజుల పాటు చికిత్స అందించారు. అనంతరం శిశువు బతికి బయట పటడంతో ఈ రోజు ఆ చిన్నారిని ఆస్పత్రి వైద్యులు శిశ్చార్జ్ చేశారు. అలాగే అదే ఆస్పత్రిలో ఐదు నెలలు నిండకుండానే జన్మించిన శిశువుకు సైతం ప్రాణం పోశారు రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి వైద్యులు. అంతేకాకుండా నెలలు నిండకుండానే జన్మించిన మరో నలుగురు శిశువులను సైతం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వేడుకను నిర్వహించారు. ఇందులో శిశువుల తల్లిదండ్రులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి,వైజాక్‌లోని సీనియర్ ప్రసూతి వైద్యులు డాక్టర్ సీహెచ్ రాధసుధను మార్చి 29,2022న ఐదున్నర నెలలు ఉన్న హనీషా అనే గర్భవతి వైద్యులను కలిసింది. నీరు బయటకు వస్తుందని వైద్యులతో వివరించారు. ఆమెకు అత్యవసరంగా చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షలో ఆమె గర్భంలో అసలు ఉమ్మినీరులేదని తేలింది. తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్ తాలుకా లక్షణాలు కూడా ఏమి లేవని గుర్తించారు. తల్లిదండ్రులతో పాటు ఎన్‌ఐసీయూ సిబ్బందితో చర్చించిన తర్వాత వైద్యురాలు రాగసుధ తక్షణమ డెలివరీ చేయకుండా కొన్ని రోజుల పాటు గర్భం పొడించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గర్భవతి అయిన హనీషాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్యులు చర్యలు తీసుకున్నారు. శిశువు ఊపిరితిత్తులు, మెదుడు డెవలప్ అయ్యేందుకు తగిన మందులను అందించారు. కానీ ఎనిమిది రోజుల తర్వాత హనీషాకు ఆపరేషన్ నిర్వహించి ఏప్రిల్ 7న డాక్టర్ విశాల్ కోలీ ఆధ్వర్యంలో డాక్టర్ రాగసుధతో పాటు ఎన్‌ఐసీయు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది డెలివరీ చేశారు. ఆపరేషన్ అనంతరం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువు అర్జున్ తనంతట తానుగా శ్వాస అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ శిశువుకు వెంటనే ఇంట్యుబేషన్ అవసరం ఏర్పడింది. అతిచిన్న పరిమాణం కలిగిన ఎండోట్రాచియల్ ట్యూబ్‌లో దీనిని అమర్చారు. అతని ఊపిరి తిత్తుల ఆరోగ్యం మెరుగుపడేందుకు సర్ఫెక్టెంట్‌గా పిలిచే మెడిసిన్‌ను అందించారు. ఈ చిన్నారిని బతికించేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ముందుగానే వైద్య బృందం గుర్తించింది.
అర్జున్ పుట్టినప్పుడు బరువు 430 గ్రాములే..
అర్జున్ పుట్టినప్పుడు బరువు కేవలం 430 గ్రాములే. సాధారణ పుట్టిన శిశువు దాదాపు 3 కిలోల బరువుతో పుడతారు. అర్జున్ శరీరంలోని అవయవాలన్ని కూడా ఇంకా డెవలప్ అవుతున్న దశలోనే ఉన్నాయి. అతను తనంతట తాను బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అతని బాడీలో తగిన పోషక నిల్వలు కూడా లేవు. అలాగే శిశువు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో బాధపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతని చర్మం కూడా పలుచగా ఉండటం, ఎక్కువ మొత్తంలో నీరు, వేడి కోల్పోయే అవకాశాలున్నాయని వైద్యులు గుర్తించారు. శిశువు అర్జున్ ఉన్న పరిస్థితిలో సాధారణ కాంతి, శబ్దాలు కూడా అతని కళ్లు, చెవులకు నష్టం కలిగించే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. తాము అతనిని ప్రత్యేకమైన ఇన్‌క్యూబెటర్‌లో ఉంచామని, ఆ ఇన్‌క్యూబేటర్ లోపల పూర్తి చీకటిగా ఉండటంతో పాటు అతి తక్కువ శబ్దం మాత్రమే వినబడేలా చేశారు వైద్యులు.
ఈ సందర్భంగా డాక్టర్ అన్వేష్ అమితి మాట్లాడుతూ.. ఎన్‌ఐసీయూలో ఉన్నప్పుడు అర్జున్‌కు దాదాపు 50 రోజుల పాఉట వెంటిలేటర్ అవసరం వచ్చిందని, దీనిని అనుసరించి ఆక్సిజన్ సహాయంతో మరో 25 రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. అతనికి అవసరమైన పోషకాలను అతని నరాల ద్వరాఆ అందించడంతో పాటు తల్లి పాలను కూడా అందించామన్నారు. దీని ద్వారా శిశువు ఎదుగుదల, బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగు పర్చారు. ఈ సమయంలో చిన్నారి కొన్ని ఒడిదొడుకులు, కామెర్లు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, పుట్టినప్పుడు అతి తక్కువ బరువు ఉండటం వంటి ఉన్నాయని వివరించారు. ఏదీ ఏమైనా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ చిన్నారులకు ప్రాణం పోసినట్లు వైద్యులు తెలిపారు.
అర్జున్ తల్లి హనీషా ఏమన్నారంటే..
ఈ సందర్భంగా శిశువు అర్జున్ తల్లి హనీషా మాట్లాడుతూ.. మొదటి రెండు వారాలు మాకు తీవ్ర ఒత్తిడి ఉండేది. మా బాబు ఇన్‌క్యుబేటర్‌లో ఉంటాడని, శిశువు చుట్టు ట్యూబ్‌లు, వైర్లు ఇలా ఎన్నో ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు. ఇంత బాధలో ఉన్న మాకు ఆశాకిరణలా కనిపించిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎన్‌ఐసీయ బృందం. ఎంతో శ్రమించారు. మా వైద్యులు మమ్మల్ని మాబాబును తాకమని ఎంతో ప్రోత్సహించేవారు. తల్లిదండ్రుల స్పర్శ, గొంతు వినడం ద్వారా అతను స్పందిస్తాడని చెప్పారు. నేను మా బాబును తాకిన క్షణాలు ఎన్నుడూ మార్చపోలేను. అతను నా వేలిని పట్టుకున్నాడు. అదో అద్బుతమైన క్షణంలా అనిపించింది.
డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ..
అర్జున్ శరీర బరువు ఒకే కిలో చేరడానికి 45 రోజుల సమయంపట్టింది. ఇప్పుడు అతని బరువు 1.7 కిలోలు. తనకు ఎదురైన కష్టాలతో 85 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత అర్జున్ జీవితంపై గెలుపు దిశగా వెళ్తున్నాడు. శిశువు అవయవాలన్ని నెలలు నిండిన తల్లి గర్భంలో ఏ విధంగా డెవలప్ అవుతాయో అదే విధంగా వృద్ధి చెందుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని అన్నారు. శిశువు ఎదుగుదలను క్రమం తప్పకుండా పరీక్షించాల్సి ఉంది. గత నెలలో వైజాక్ రెయిన్‌బో చిల్ట్రన్ హాస్పిటల్‌లో సాధారణంగా కేవలం 24-27 వారాల గర్భం కలిగినప్పటికీ జన్మించిన ఐదుగురు శిశువులను డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. పుట్టినప్పుడు శిశువు బరువు 430 నుంచి 850 గ్రాములు మాత్రమే ఉంది. ఎంతో శ్రమించి శిశువులను బతికించాము. ఎలాంటి సమస్యలు లేకుండా వారు ఇంటికి వెళ్లగలిగారని అన్నారు.
సంతోషంగా మా బేబీని ఇంటికి తీసుకెళ్లాము..
ఈ సందర్భంగా శిశువు డిశ్చార్జ్‌తో సంతోషంగా ఇంటికెళ్లిన అలేఖ్య-వెంకటేష్‌లు మాట్లాడుతూ.. మా బేబీ గర్భం దాల్చిన 25 వారాలకే కేవలం 830 గ్రాముల బరువుతో అనకాపల్లిలో జన్మించారు. కేవలం రెయిన్‌బో చిల్ట్రన్ ఆస్పత్రి వైద్యులు కాపాడగలిగారు అని అన్నారు. ఆరోగ్యవంతంగా మా బేబీని ఇంటికి తీసుకెళ్లాలమని అన్నారు.
ఈ సందర్భంగా మరో తండ్రి కె. ప్రసాద్ మాట్లాడుతూ. మాకు కవల పిల్లలు పుట్టిన తర్వతా ఏం జరుగుతుందనేది మాకు తెలియదు. మా బేబీస్ ఇద్దరు వెంటిలేటర్‌పైకి వెళ్లారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ రెయిన్‌బో చిల్ట్రన్ ఆస్పత్రి మాకు ఎంతో సహాయ పడింది. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి