విశాఖలో టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ర్యాలీకి నో పర్మిషన్!
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం విశాఖలో టీడీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్..
EX CM Chandrababu Vizag Tour: ప్రస్తుతం విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా మరికొద్దిసేపట్లో చంద్రబాబు ఎయిర్ పోర్టకు చేరుకోనున్నారు.
కాగా.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం విశాఖలో టీడీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అది కూడా కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో పర్యటించాలన్నారు. అయితే.. ఎలాంటి ర్యాలీలు చేయకూడదన్నారు. దీంతో విశాఖ పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఏం జరగబోతుందనే టెన్షన్ నెలకొంది.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశావని, ప్రజా చైతన్యకు వస్తున్నావని ప్రశ్నిస్తున్నారు? ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పకుండా.. కేవలం అమరావతి మాత్రమే రాజధాని అంటున్న చంద్రబాబు తీరును విశాఖ వాసులు తప్పుబడుతున్నారు. మూడు రాజధానులను ఏపీ ప్రభుత్వం ప్రకటించడం.. దానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ్టి టూర్‌పై ఉత్కంఠ నెలకొంది.
కానీ చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు రాగానే ఆయన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. దీనిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. చంద్రబాబు యాత్రకు భద్రత కల్పించాలని సిపిని కోరారు విశాఖ టీడీపీ నేతలు. చంద్రబాబును ఎదుర్కోలేకే వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరో వైపు పోలీసుల తీరును కూడా తెలుగు తమ్ముళ్లు తప్పుబడుతున్నారు.