AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌పై దాడి..!

నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌పై మూకుమ్మడి దాడి చేశారు నలుగురు యువకులు. రాత్రంతా ఓ గదిలో బంధించి వేధించారు. ఈ క్రమంలో రాత్రంతా నరకం అనుభవించిన ఆ బాధితురాలు తెల్లవారుజామున అక్కడి నుంచి తప్పించుకొని భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.

దారుణం: నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌పై దాడి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 26, 2020 | 9:34 PM

Share

నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌పై మూకుమ్మడి దాడి చేశారు నలుగురు యువకులు. రాత్రంతా ఓ గదిలో బంధించి వేధించారు. ఈ క్రమంలో రాత్రంతా నరకం అనుభవించిన ఆ బాధితురాలు తెల్లవారుజామున అక్కడి నుంచి తప్పించుకొని భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌ శివారులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టినరోజు వేడుకల కోసం ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కొందరు. ఆ క్రమంలో ఫిబ్రవరి 22న రాత్రి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక అర్ధరాత్రి సెలబ్రేషన్లు ముగిసిన తరువాత ఫుల్‌గా మద్యం సేవించిన నలుగురు యువకులు.. నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ ఆమెను బలవంతపెట్టారు. అందుకు ఆమె నిరాకరించడంతో కత్తులతో బెదిరించారు. ఆ తరువాత భయపెట్టి గదిలో బంధించారు. రాత్రంతా వారి చెరలోనే ఉన్న బాధితురాలు తెల్లవారుజామున ఎట్టకేలకు తప్పించుకొని ఇంటికి చేరుకుంది. తరువాత తన భర్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు. మహిళపై దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వెల్లడించారు.

Follow Us
ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. అధికారిక ప్రకటన
ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. అధికారిక ప్రకటన
కొత్త ఇంటికి మారుతున్నారా? పాత ఇంటి నుంచి ఈ 4 వస్తువులను అస్సలు..
కొత్త ఇంటికి మారుతున్నారా? పాత ఇంటి నుంచి ఈ 4 వస్తువులను అస్సలు..
ఫొటోలు ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
ఫొటోలు ఇంట్లో ఏ దిశలో పెట్టాలో తెలుసా?
లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..!
లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..!
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే
ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల ఉద్యోగం
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
అమ్మవారి ఆశీర్వాదం తర్వాతే ప్రాణాలు విడిచే తాబేళ్లు..! త్రిపుర..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన ఆ హీరో చనిపోయాడని తెలుసా?
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..