పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలోనే మొదటి కేసు!

కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే చైనా వ్యాప్తంగా మూడు వేల మంది మరణించారు. ఇప్పుడు 'రుగోస్ వైరస్' అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును..

పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలోనే మొదటి కేసు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 01, 2020 | 3:33 PM

Rugose Virus: కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే చైనా వ్యాప్తంగా మూడు వేల మంది మరణించారు. ఇప్పుడు ‘రుగోస్ వైరస్’ అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును కనుగొన్నది కేరళలోనే.. ఇప్పుడు ఈ రుగోస్ వైరస్‌ని కనుగొంది కూడా కేరళలోనే.

రుగోస్ వైరస్ అత్యంత డేంజరస్‌‌గా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది తెల్లదోమ వల్ల సోకుతుందట. ఈ తెల్లదోమలు మొక్కలోని, చెట్లలోని రసాన్ని పీల్చివేస్తుంది. ఫలితంగా చెట్లు ఎండుపోయి, కొమ్మలు రాలడం ప్రారంభమవుతుంది. దీంతో ఈ ఎఫెక్ట్ కాస్తా దిగుబడిపై పడుతోంది. కాగా ఈ వైరస్ పేరిట ఏపీలో మొదటి కేసు నమోదయ్యింది. ఈ రుగోస్ వైరస్‌ని మొదట తూర్పుగోదావరి జిల్లాలోని కడియంలో కొబ్బరి చెట్లపై గుర్తించారు. అలాగే ఇప్పుడు ఈ వైరస్ ఏపీలోని వైజాగ్, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో స్వైర విహారం చేస్తోంది.

అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. దీంతో రైతులు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అలాగే భాగంగా సపోర్టు ఇసారియా ఫంగస్‌ను ఉచితంగా రైతులకు ఇస్తున్నారు. ఈ మందుతో వైరస్‌ని కట్టడి చేయవచ్చని, అయినా రైతులు పండ్ల తోటల పట్ల జాగ్రత వహించాలని చెబుతున్నారు. అలాగే తోటల్లో ఎలాంటి మార్పులు వచ్చినా.. స్థానిక అధికారులకు తెలపాలని శాస్త్రవేత్తలు సూచించారు.