JNTUH: జేఎన్‌టీయూ కీలక నిర్ణయం.. ఇకపై బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..
జిల్ జిల్ జిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు చెక్ పెట్టేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది...
JNTU Hyderabad New Rules: కొంతమంది విద్యార్థులు కాలేజీలకు బంక్‌లు కొడుతూ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారు. అలా జిల్ జిల్ జిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు చెక్ పెట్టేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. ఒకవేళ ఈ రూల్‌ను కాలేజీలు పాటించకపోతే.. అఫ్లియేషన్‌కు అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీలో 42 విలేజ్ కోర్టులు..
మంగళవారం జేఎన్‌టీయూ హైదరాబాద్ ఇంచార్జ్ వీసీ జయేష్ రంజన్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యి ఏఐసీటీ రూల్స్‌పై చర్చించారు. ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోని లెక్చరర్లు, పీజీ కళాశాలల్లోని ఫ్యాకల్టీలు, విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు..
ఈ నేపథ్యంలోనే వచ్చే సంవత్సరం నుంచి బీటెక్, బీఫార్మసీ కాలేజీ విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. దీనికి కాలేజీ యాజమాన్యాలూ సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. అటు 2020-21 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అఫ్లియేషన్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని సౌకర్యం ఉండగా.. మార్చి 10న ఆఖరి తేదీగా ప్రకటించారు. ఇక మార్చి 16 నుంచి కాలేజీలు తనిఖీలు చేపట్టి.. మే 31 నాటికి అఫ్లియేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
అదనపు కోర్సులు…
ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ కోర్సులతో పాటుగా సైబర్‌క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జేఎన్‌టీయూహెచ్ అధికారులు యాజమాన్యాలకు సూచించారు. కాగా, ఐదు కొత్త కోర్సులను ఏర్పాటు చేయడంపై వర్సిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!