Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Rs.2000 Notes: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

గత కొద్దిరోజులుగా రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.2 వేల నోట్లను తాము ఏటీఎంలలో పెట్టొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు...
Central Government Clarity, Rs.2000 Notes: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

Central Government Clarity: డీమోనిటైజేషన్ పేరుతో మోదీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న అవినీతి, బ్లాక్ మనీను నిర్మూలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక వాటి స్థానంలో కొత్తగా రూ.2 వేల నోటును అమలులోకి తీసుకొచ్చారు. అయితే వాటి కన్నా పెద్ద నోటును అమలులోకి తేవడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు గత కొద్దిరోజులుగా రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏటీఎంలలో కూడా అవి కనిపించకపోవడంతో ఊహాగానాలు కొనసాగాయి. దీనిపై పలుమార్లు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.

Also Read: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. రూ.2 వేల నోట్లను తాము ఏటీఎంలలో పెట్టొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనని వెల్లడించారు. దీనితో రూ.2 వేల నోట్ల రద్దు గురించి ప్రచారానికి తెరపడుతుందో లేదో వేచి చూడాలి.

రూ.2000 వేల నోట్లకు బదులు రూ.500…

ఏటీఎంలలో రూ.2 వేల నోట్లకు బదులు రూ.500 నోట్లు పెట్టాలని ఇటీవల ఇండియన్ బ్యాంక్ అధికారులు నిర్ణయించారు. పెద్ద నోట్ల స్థానంలో రూ.200, రూ.500 నోట్లు పెడతామని తెలిపారు. కస్టమర్లు రూ.2000 ఏటీఎంల నుంచి డ్రా చేసుకుని చిల్లర కోసం బ్యాంక్‌కు వస్తున్నారని.. అది కాస్తా పెద్ద సమస్యగా మారిందని అన్నారు. అందువల్లే ఖాతాదారుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Related Tags