బేగంపేట‌ హోటల్‌లో ఫుడ్ పాయిజన్.. రెండేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టిస్తోంది. బేగంపేటలోని ఓ హోటల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఓ కుటుంబం ఆస్పత్రిపాలు కాగా.. రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో బాలుడు తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే. .బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఏటుకూరి రవి నారాయణ అనే వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాస్ పోర్టు సంబంధింత విషయమై నగరానికి చేరుకుని.. బేగంపేటలోని మానసరోవర్ హోటల్‌లో బస చేశారు. అయితే హోటల్‌లో ఫుఢ్ […]

బేగంపేట‌ హోటల్‌లో ఫుడ్ పాయిజన్.. రెండేళ్ల బాలుడి మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 5:33 AM

హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టిస్తోంది. బేగంపేటలోని ఓ హోటల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఓ కుటుంబం ఆస్పత్రిపాలు కాగా.. రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో బాలుడు తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే. .బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఏటుకూరి రవి నారాయణ అనే వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాస్ పోర్టు సంబంధింత విషయమై నగరానికి చేరుకుని.. బేగంపేటలోని మానసరోవర్ హోటల్‌లో బస చేశారు. అయితే హోటల్‌లో ఫుఢ్ పాయిజన్ కావడంతో.. తిన్న వెంటనే వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చి.. చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. మంగళవారం ఉదయం ఉదయం చికిత్స పొందుతూ రెండేళ్ల బాలుడు విహాన్ చనిపోయాడు. మరో బాలుడు వరుణ్ కూడా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. హోటల్‌లోని ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపారు. కాగా.. ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.