కరోనా ఎఫెక్ట్: చికెన్ రేట్లు ఢమాల్!

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాతోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మాంసాహార ప్రియుల్లోనూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. కరోనా వైరస్‌ దెబ్బకు ఏపీలో చికెన్‌ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలో చికెన్‌ అమ్మకాలు 50 శాతం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 70 శాతం వరకూ తగ్గిపోయాయని వాపోతున్నారు. చికెన్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందనే అసత్య ప్రచారమే ఈ పతనానికి […]

కరోనా ఎఫెక్ట్: చికెన్ రేట్లు ఢమాల్!
Follow us

| Edited By:

Updated on: Feb 12, 2020 | 9:42 AM

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాతోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మాంసాహార ప్రియుల్లోనూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. కరోనా వైరస్‌ దెబ్బకు ఏపీలో చికెన్‌ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలో చికెన్‌ అమ్మకాలు 50 శాతం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 70 శాతం వరకూ తగ్గిపోయాయని వాపోతున్నారు. చికెన్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందనే అసత్య ప్రచారమే ఈ పతనానికి ప్రధాన కారణం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుకు సగటున ఐదు లక్షల కేజీల చికెన్‌ విక్రయాలు జరుగుతుంటాయి.

ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా చికెన్‌, ఇతర మాంసాహారం ఎక్కువగా తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. ఆదివారం, సెలవు దినాల్లో ఏడు లక్షల కేజీలు, పండుగ రోజుల్లో సగటున 15 లక్షల కేజీలు అమ్ముడవుతాయి. ఈ సీజన్‌లో కోడి మాంసానికి గిరాకీ ఎక్కువ. అలాంటిది కరోనా వైరస్‌ దెబ్బకు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత వారం రిటైల్‌ మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ రూ.180 వరకు పలికిన చికెన్‌ మంగళవారం నాటికి రూ.140కి పడిపోయింది. కిలో చికెన్‌ రూ.200 నుంచి రూ.150 దిగువకు పడిపోతే.. రూ.600లు ఉన్న మటన్‌ రూ.680-740 వరకు పలుకుతోంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..