AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!

NEET UG 2026 Re Exam Results: నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఆ వెనువెంటనే నీట్ యూజీ ఫలితాలను కూడా వెల్లడిస్తుంది..

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!
NEET UG Re-exam
Srilakshmi C
|

Updated on: Jul 01, 2026 | 3:28 PM

Share

హైదరాబాద్, జులై 1: నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల నుంచి అందిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి, త్వరలోనే తుది ఆన్సర్ కీని విడుదల చేసి ఫలితాలను ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిద్ధమవుతోంది. జూన్ 21, 2026న నిర్వహించిన NEET UG పునఃపరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఎన్‌టీఏ.. అభ్యర్థులకు అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజుతో అభ్యంతరాలను స్వీకరించింది. నిపుణుల బృందం ఆ అభ్యంతరాలను సరైనవిగా తేల్చితే సదరు అభ్యర్ధి చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. OMR స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే అభ్యంతరాల పరిశీలనను సమాంతరంగా నిర్వహించడం వల్ల.. తుది ఆన్సర్ కీ విడుదలతో పాటు ఫలితాలను కూడా వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. తుది ఆన్సర్ కీనే తుది నిర్ణయంగా పరిగణించబడుతుందని, ఫలితాల విడుదల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబడవని ఎన్టీయే స్పష్టం చేసింది.

కాగా మే 3న జరిగిన అసలు నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్‌ లీకేజీతో రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు పరీక్ష ఫీజు రీఫండ్ ఇవ్వనున్నట్లు ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు నమోదైనట్లు గుర్తించడంతో వాటిని సవరించుకునేందుకు ప్రత్యేక రీఫండ్ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించింది. ఈ అవకాశాన్ని జూలై 7, 2026 రాత్రి 11:50 గంటల వరకు పొడిగించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించడంతోపాటు ఏవైనా పొరబాట్లు ఉంటే సవరించుకోవచ్చు. అవసరమైతే రద్దు చేసిన చెక్కు ప్రతిని కూడా అప్‌లోడ్ చేయవచ్చు. రెండు దశల ధృవీకరణ పూర్తైన తర్వాత సమర్పించిన వివరాలనే తుది వివరాలుగా పరిగణిస్తారు.

ఇక రెండో సారి నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో 20 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరైనట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్ సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహించింది. తుది ఆన్సర్ కీ, ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలతో స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్‌ యూజీ 2026 ఆన్సర్‌ కీ, ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని NTA అధికారిక వెబ్‌సైట్లు https://www.nta.ac.in/ లేదా https://neet.nta.nic.in/ లను సందర్శించాలని అధికారులు సూచించారు. ఇతర సందేహాలకు 011-40759000 లేదా 011-69227700 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు. లేదా neetug2026@nta.ac.in కు ఇమెయిల్ పంపవచ్చు.

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?