కరోనాతో రాజకీయాలు వద్దు..ప్రతిపక్షాలకు మంత్రి హితవు

ఓ వైపు దేశవ్యాప్తంగా కరోన కల్లోలం సృష్టిస్తుంటే..తెలంగాణలో విపక్షాలు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

కరోనాతో రాజకీయాలు వద్దు..ప్రతిపక్షాలకు మంత్రి హితవు
Follow us

|

Updated on: Jul 13, 2020 | 5:56 PM

ఓ వైపు దేశవ్యాప్తంగా కరోన కల్లోలం సృష్టిస్తుంటే..తెలంగాణలో విపక్షాలు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా విషయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నదని, ఇది ప్రధాని మోదీ వైఫల్యంగా భావించాలా అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ..త్వరలోనే మెడికల్ కాలేజీలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వైద్యం, విద్య ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంపై మరింత నమ్మకం కలిగిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులను తిరస్కరించినా, ప్రభుత్వ ఆసుపత్రులు అండగా నిలిచాయని తెలిపారు. కరోనా రోగులతో వేలివేసినట్టుగా వ్యవహరించరాదని అన్నారు. కరోనా వారు వీరు అనే తేడా లేకుండా ఎవరికైనా రావొచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇది రాజకీయాలకు సమయం కాదని, కలిసికట్టుగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయం అన్నారు. రాజకీయంగా విమర్శలు చేయడం వలన వైద్య సిబ్బంది ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని అన్నారు. రెండు శాతం మరణాలను చూపించి, 98 శాతం రికవరీలను చిన్నదిగా చూపొద్దని కోరారు. అవసరమైతే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..