వేద వ్యవసాయంతో కృష్ణ బియ్యం పండిస్తున్న కరీంనగర్ యువకుడు..
ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు విజయవంతంగా పండిస్తున్నారు.
Krishna Biyyam Growing: ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చదువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నారు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలజియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.
కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణ బియ్యం ఉపయోగపడతాయని రుజువైంది. అదేవిధంగా మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందని, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందని రుజువైంది. కడుపు మంట, బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, మలబద్ధకాన్ని, అతిసారను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని రుజువైంది.
100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి :
- ప్రొటీన్లు – 8.8 నుంచి 12.5 గ్రాములు
- లిపిడ్స్ – 3.33 గ్రాములు
- ఐరన్ – 2.4 మిల్లీ గ్రాములు
- అమిలోజ్ – 8.27 శాతం
- కాల్షియం – 24.06 మిల్లీ గ్రాములు
- మెగ్నీసియం – 58.46 మిల్లీ గ్రాములు
- యాంథోసయనిన్స్ – 69 నుంచి 74 మిల్లీ గ్రాములు
Also Read:
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..
”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”
ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే
“IPL will bring back normalcy into our lives.”
From teaming up with captain @stevesmith49 to an upcoming star in @yashasvi_j, senior @rajasthanroyals batsman @robbieuthappa tells @Moulinparikh why this season is truly special.#Dream11IPL
Full video?? https://t.co/WrAdqo9jSW pic.twitter.com/MS4vrHMlzv
— IndianPremierLeague (@IPL) September 11, 2020