KRCL Railway Jobs 2026: రాత పరీక్ష లేకుండానే కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఏడాది శిక్షణ కోసం అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు..

కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఏడాది శిక్షణ కోసం అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ విభాగాలకలె ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 2021 నుంచి 2025 మధ్య సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ, ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఎంపిక చేస్తారు. ఇందులో కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం భూమి కోల్పోయిన అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
కొంకణ్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
