ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన జాయింట్ కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అధికారి ఏసీబీ వలలో అడ్డంగా చిక్కుకున్నాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే 45వేల రూపాయలను తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జాయింట్ కలెక్టర్ తాజుద్దీన్. రేషన్ డీలర్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలవేసి పట్టుకుంది. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ.. తాజుద్దీన్ 50వేల రూపాయలను డిమాండ్ చేశారు. 162 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విడుదల చేయడం కోసం భారీగా లంచం అడగడంతో.. జన్ను అనిల్ అనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:16 am, Thu, 21 February 19
ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన జాయింట్ కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అధికారి ఏసీబీ వలలో అడ్డంగా చిక్కుకున్నాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే 45వేల రూపాయలను తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జాయింట్ కలెక్టర్ తాజుద్దీన్. రేషన్ డీలర్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలవేసి పట్టుకుంది. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ.. తాజుద్దీన్ 50వేల రూపాయలను డిమాండ్ చేశారు. 162 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విడుదల చేయడం కోసం భారీగా లంచం అడగడంతో.. జన్ను అనిల్ అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఇంకా.. ఈ లంచం వ్యవహారంలో మరెవరైనా అధికారుల ప్రమేయం ఉందా అన్నదానిపై ఏసీబీ ఆరా తీస్తోంది.