మూడు జిల్లాలుగా గుంటూరు

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారం చేపట్టాక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలైన గుంటూరు, నర్సరావుపేటలతో పాటు బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా చీరాలను జిల్లాలుగా మార్చే దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ జిల్లాలో 65లక్షల జనాభా ఉండగా.. 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు, తెనాలి, నర్సారావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లుగా పనిచేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలకు […]

మూడు జిల్లాలుగా గుంటూరు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jun 07, 2019 | 11:29 AM

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారం చేపట్టాక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలైన గుంటూరు, నర్సరావుపేటలతో పాటు బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా చీరాలను జిల్లాలుగా మార్చే దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ జిల్లాలో 65లక్షల జనాభా ఉండగా.. 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు, తెనాలి, నర్సారావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లుగా పనిచేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలకు జిల్లా దూరంగా ఉండటం వలన అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ పథకం అందరికీ అందేందుకు.. చిన్న చిన్న జిల్లాలుగా మార్చాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్నాడును జిల్లాగా మార్చాలని అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఓ ప్రపోజల్‌ను ప్రభుత్వం ముందుంచారు. చిన్న చిన్న జిల్లాలుగా ఉండటం వలన పాలన కూడా సౌలభ్యంగా ఉంటుందని ఆయన అప్పట్లో తన నిర్ణయాన్ని తెలిపారు.