అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా..!

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకు వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడు

  • Publish Date - 3:39 pm, Thu, 11 June 20 Edited By:
అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా..!

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజుకు వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడు ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లో ఉన్న భార్య, భర్త, ముగ్గురు పిల్లలకు కరోనా సోకింది. లాక్‌డౌన్ ముందు తమిళనాడుకు వెళ్లిన వీరు.. గత నెల 30న తాడిపత్రికి తిరిగి వచ్చారు. మొదటిసారి టెస్ట్‌లో వీరికి నెగిటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి అధికారులు ఇంటికి పంపారు. ఇక రెండవసారి జరిగిన పరీక్షల్లో వీరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరి కాంటాక్ట్ అయిన వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అనంత జిల్లాలోని యాడికి మండల కేంద్రంలో మొత్తం 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన తరువాత వీరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా ఏపీలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4261కి చేరగా.. ప్రస్తుతం 1641 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

Read This Story Also: ‘సాహో’ దర్శకుడు సుజీత్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..!