ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షలపై కొనసాగుతోన్న ఉత్కంఠ…
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అమలు చేసిన గ్రేడింగ్ విధానంపై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి తెలిపారు.
స్టేట్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడిన తర్వాతే పరీక్షల నిర్వహణ తేదీని ప్రకటిస్తామని అన్నారు. పరీక్షల నిర్వహణకు సమాయత్తం కావడానికి 15 రోజుల సమయం పడుతుందని.. అందుకే ప్రభుత్వం నుంచి నిర్ణయం ఎప్పుడు వచ్చినా కూడా మేము పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని గోపాల్ రెడ్డి వెల్లడించారు.




