వ్యవసాయ అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు

కడప జిల్లా కమలాపురంలో వ్యవసాయశాఖ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో పాటు 20 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇక రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త బయటకు రావడంతో వ్యవసాయ అధికారులు అక్కడినుంచి పరారయ్యారు. ఆఫీసుకు తాళం వేసి ఇంటికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:24 am, Sat, 23 February 19
వ్యవసాయ అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు

కడప జిల్లా కమలాపురంలో వ్యవసాయశాఖ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో పాటు 20 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇక రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త బయటకు రావడంతో వ్యవసాయ అధికారులు అక్కడినుంచి పరారయ్యారు. ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే మరికొంతమంది రైతులు దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి రాగా.. తాళం వేసి ఉన్న ఆఫీసు స్వాగతం పలికింది. దీంతో ఆగ్రహించిన రైతుల ధర్నాకు దిగారు.