విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఈ ఒక్క విమానంతో 12 దేశాలకు కనెక్టివిటీ..

విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్, థాయ్ లాండ్‎లకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పూర్తి అక్యుపెన్సీ‎తో అవి నడుస్తూ ఉన్నాయి. దీంతో మరికొన్ని అంతర్జాతీయ డెస్టినేషన్‎లకు సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.

విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఈ ఒక్క విమానంతో 12 దేశాలకు కనెక్టివిటీ..
Vishakapatnam
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 7:04 PM

విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్, థాయ్ లాండ్‎లకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. పూర్తి అక్యుపెన్సీ‎తో అవి నడుస్తూ ఉన్నాయి. దీంతో మరికొన్ని అంతర్జాతీయ డెస్టినేషన్‎లకు సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా కౌలాలంపూర్‎కు శుక్రవారం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తొలి విమానం 100 శాతం ఆక్యుపెన్సి‎తో ప్రారంభం కావడం విశేషం.

థాయ్ ఎయిర్ ఏషియా ద్వారా మలేషియాకు ఈ కొత్త అంతర్జాతీయ విమానం ప్రారంభం అయింది. శుక్రవారం విశాఖపట్నం నుంచి థాయ్ ఎయిర్ ఏషియా ద్వారా మలేసియాకు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాల రాక పోకలతో అనేక లాభాలు ఉంటాయన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగా, సర్వీస్ సెక్టార్ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరిగి తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు.

టైమింగ్స్ ఇలా..

కౌలాలంపూర్ నుంచి రాత్రి 9:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకునే ఈ విమానం, తిరిగి 10 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజాము 4:20 గంటలకు కౌలాలంపూర్ చేరుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఒక్క విమానంతో ఎన్ని దేశాలకు కనెక్టివిటీ తెలుసా?

ఈ సర్వీసుతో కంబొడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లే వారికి ఉపయుక్తంగా ఉండనుంది. పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో కౌలాలంపూర్ను సందర్శించే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వినాశ్రయ వర్గాలు కోరుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles