Savings Account Charges: ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్.. సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!

చాలా మంది ప్రభుత్వ రంగ బ్యాంకులతో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ఖాతాలు ఉంటాయి. కానీ తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు అయిన ఐసీఐసీఐ, యాక్సిస్, యస్ బ్యాంకులు సేవింగ్స్ ఖాతా నిర్వహణపై పలు రకాల చార్జీలను సవరించాయి. సవరించిన ఛార్జీల్లో కొన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా మరికొన్ని మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

Savings Account Charges: ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్.. సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!
Bank Accounts
Follow us

|

Updated on: Apr 27, 2024 | 5:30 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా సొమ్ము దాచుకునేందుకు బ్యాంకు ఖాతాలు ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే చాలా మంది ప్రభుత్వ రంగ బ్యాంకులతో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ఖాతాలు ఉంటాయి. కానీ తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు అయిన ఐసీఐసీఐ, యాక్సిస్, యస్ బ్యాంకులు సేవింగ్స్ ఖాతా నిర్వహణపై పలు రకాల చార్జీలను సవరించాయి. సవరించిన ఛార్జీల్లో కొన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా మరికొన్ని మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, నగదు లావాదేవీలు మరియు మరిన్నింటితో సహా అనేక రకాల సేవలపై ఈ చార్జీల ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్ ఖాతా చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐసీఐసీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఛార్జీలు

  • చెక్ బుక్‌లు, ఐఎంపీఎస్ లావాదేవీలు , ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్‌లు, స్టాప్ పేమెంట్ ఛార్జీలతో సహా వివిధ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సేవల కోసం ఐసీఐసీ బ్యాంక్ ఫీజులను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1, 2024 నుండి అమల్లోకి వస్తాయి. 
  • డెబిట్ కార్డ్ ఫీజు సంవత్సరానికి రూ. 200గా సవరించారు. అయితే ఈ చార్జీ గ్రామీణ స్థానాలకు సంవత్సరానికి రూ.99గా ఉంది. 
  • చెక్ బుక్స్ సంవత్సరానికి మొదటి 25 చెక్ లీఫ్‌లకు ఛార్జీ లేకపోయినా ఆ తర్వాత ఒక్కో లీఫ్‌కు రూ.4 చార్జీ విధించారు. 
  • డీడీ/పీఓ ఫీజు రద్దు చేశారు. అయితే డూప్లికేట్ లేదా రీవాలిడేషన్ కోసం రూ. 100గా నిర్ణయించారు.
  • సంతకం ధృవీకరణకు రూ. 100 వసూలు చేయనున్నారు. 
  • ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్‌లు:  ఆర్థిక కారణాల దృష్ట్యా ఒక్కో దానికి రూ. 500గా వసూలు చేయనున్నారు. అయితే నెలకు గరిష్టంగా 3 సందర్భాల్లోనే సేవలను పొందాలి. 
  • స్టాప్ పేమెంట్ ఛార్జీలు నిర్దిష్ట చెక్ కోసం రూ. 100గా నిర్ణయించారు. అయితే కస్టమర్ కేర్ ఐవీఆర్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఉచితంగా ఈ సేవను పొందవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ 

  • యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతా టారిఫ్ నిర్మాణాన్ని అప్‌డేట్ చేసింది. ఇది పొదుపు, జీతం ఖాతాల కనీస నిల్వ అవసరాలతో పాటు నగదు లావాదేవీల పరిమితులను ప్రభావితం చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రాధాన్యతా పొదుపు ఖాతాల కోసం సగటు బ్యాలెన్స్ అవసరం మార్చారు. గతంలో సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (ఏక్యూబీ) రూ. 2,00,000 ఉండగా దాన్ని ఇప్పుడు, రూ. 2,00,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ వర్గీకరించారు. 
  • ప్రైమ్, లిబర్టీ, ప్రెస్టీజ్, ప్రయారిటీ సేవింగ్స్ ఖాతాల కోసం, ఇప్పుడు థర్డ్-పార్టీ నగదు లావాదేవీలకు నెలకు రూ. 25,000 ఉచిత పరిమితి ఉంది. ఈ పరిమితిని మించి కనీస రుసుము రూ. 150తో వెయ్యికి రూ. 10గా నిర్ణయించారు. 

ఉచిత నగదు లావాదేవీలు ఇలా

  • ప్రైమ్/లిబర్టీ ఖాతాలకు మొదటి 5 లావాదేవీలు లేదా నెలకు రూ. 1.5 లక్షల వరకు ఉచితంగా ఉంటుంది. 
  • ప్రెస్టీజ్ ఖాతాలకు మొదటి 5 లావాదేవీలు లేదా నెలకు రెండు లక్షల వరకూ ఉచితంగా ఉంటుంది. 
  • ప్రయారిటీ ఖాతాలకు మొదటి 7 లావాదేవీలు లేదా నెలకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా ఉంటుంది. 

యస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఛార్జీలు

ప్రైవేట్ రంగ రుణదాత అయిన యస్ బ్యాంక్, పొదుపు ఖాతా ఛార్జీల షెడ్యూల్‌ను అప్‌డేట్ చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1, 2024 నుండి అమల్లోకి వస్తాయి. అదనంగా బ్యాంక్ కొన్ని ఖాతా రకాలను నిలిపివేసింది.

సగటు నెలవారీ బ్యాలెన్స్ అవసరాలు

సేవింగ్స్ ఖాతా పీఆర్ఓ గరిష్టంగా రూ. 50,000. నాన్-మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ రూ. 1,000గా ఉంది. సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్, యస్ ఎసెన్స్, యస్ రెస్పెక్ట్ ఖాతాలకు రూ.25,000. నాన్-మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ రూ. 750గా ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి