Store Food Without Refrigerator: ఫ్రిజ్‌ లేకున్నా ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

వేసవిలో సీజన్‌లో ఆహారం త్వరగా పాడైపోతుంది. ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగస్‌లు త్వరగా వృద్ధి చెందడం వల్ల ఈ కాలంలో ఆహారం చెడిపోతుంది. అందుకే వేసవి కాలంలో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కష్టంగా మారుతుంది. ఫ్రిజ్ లేనప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. వేసవి కాలంలో ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువ సమయం పాడైపోకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేని వారి పరిస్థితేంటి? మరేం పర్వాలేదు..

Store Food Without Refrigerator: ఫ్రిజ్‌ లేకున్నా ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
Store Food Without Refrigerator
Follow us

|

Updated on: May 09, 2024 | 7:29 PM

వేసవిలో సీజన్‌లో ఆహారం త్వరగా పాడైపోతుంది. ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగస్‌లు త్వరగా వృద్ధి చెందడం వల్ల ఈ కాలంలో ఆహారం చెడిపోతుంది. అందుకే వేసవి కాలంలో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కష్టంగా మారుతుంది. ఫ్రిజ్ లేనప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. వేసవి కాలంలో ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువ సమయం పాడైపోకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేని వారి పరిస్థితేంటి? మరేం పర్వాలేదు.. ఫ్రిజ్ లేకపోయినా వేసవిలో కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ఆహారాన్ని ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.

వంట చేసేటప్పుడు మసాలాల వాడకాన్ని తగ్గించాలి

వేసవి కాలంలో మసాలాలు ఎక్కువగా వాడే వంటకాలు త్వరగా పాడైపోతాయి. ఈ సీజన్‌లో తేలికగా మసాలాలు ఉన్న ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. మసాలా తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. పైగా ఇటువంటి ఆహారం త్వరగా చెడిపోదు. ప్రయాణాలు చేసే వారు తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని కూడా ప్యాక్ చేస్తే పాడవకుండా ఉంటుంది. అలాకాకుండా ఎక్కువ మసాలాలతో ఆహారాన్ని ప్యాక్ చేస్తే త్వరగా పాడైపోతుంది.

వంటల్లో ఉల్లిపాయలు, టమోటాలు తక్కువగా వేసుకోవాలి

టమోటాలు, ఉల్లిపాయలు లేకుండా వంట చేస్తే అంత రుచిగా అనిపించదు. కానీ వండిన ఆహారం నిల్వ ఉంచాలంటే వీటి పరిమాణాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవవు. అలాగే ఉల్లిపాయలు, టొమాటోలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినే అలవాటు ఉంటే.. ఇటువంటి ఆహారాలను ఉడికించిన 2 నుండి 3 గంటలలోపు తినిస్తే బెటర్.

ఇవి కూడా చదవండి

పదే పదే ఆహారాన్ని వేడి చేయకూడదు

చాలా మంది చల్లటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. దీంతో వారు ఆహారం తినేటప్పుడు ఖచ్చితంగా వేడి చేస్తారు. ఇలా పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల దాని రుచి దెబ్బతింటుంది. త్వరగా పాడవుతుంది.

ఆహారంలో మిశ్రమ పదార్ధాలు కలపకూడదు

కొందరికి వివిధ రకాల పదార్ధాలను మిక్స్‌ చేసుకుని తినే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే ఆహారం త్వరగా చెడిపోయే అవకాశం మరింత పెరుగుతుంది. అందువల్ల, తినగలిగినంత మాత్రమే ఆహారాన్ని వండుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి